Tirumala Rush : తిరుమలలో భక్తుల రద్దీ
వైకుంఠ ద్వార దర్శనం
Tirumala Rush : తిరుమల – ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్బంగా తిరుమల పుణ్య క్షేత్రం భక్త జన సందోహంతో నిండి పోయింది. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తండోప తండాలుగా తరలి వచ్చారు. ఎక్కడ చూసినా భక్తులతో కిట కిట లాడింది. వైకుంఠ ద్వార దర్శనం ప్రతి ఒక్కరికీ అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (TTD) చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మా రెడ్డి.
Tirumala Rush with Devotees
ఇదిలా ఉండగా వైకుంఠ ద్వార దర్శనం సందర్బంగా ముందస్తుగా బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు ప్రకటించారు. ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించేది లేదంటూ పేర్కొన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు . శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను అంగ రంగ వైభవంగా అలంకరించారు.
భక్త బాంధవులకు వసతి సౌకర్యాల ఏర్పాటుపై ఫోకస్ పెట్టినట్లు తెలిపారు ఈవో ఏవీ ధర్మా రెడ్డి. జనవరి 1 వరకు వైకుంఠ ద్వార దర్శన భాగ్యం భక్తులకు కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. ముందస్తుగా 4 లక్షలకు పైగా ఉచితంగా టోకెన్లు జారీ చేసినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా స్వామి వారిని 67 వేల 907 మంది భక్తులు దర్శించుకున్నారు. 28 వేల 492 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.50 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.
Also Read : HCA President : రాచకొండ సీపీతో హెచ్సీఏ చీఫ్ భేటీ