Mallu Bhatti Vikramarka : సమస్యల విన్నపం పీఎం సానుకూలం
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
Mallu Bhatti Vikramarka : న్యూఢిల్లీ – తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అపరిష్కృతంంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విన్నవించడం జరిగిందని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka). పీఎంను సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పీఎంను మర్యాద పూర్వకంగా కలుసుకున్నట్లు తెలిపారు. మోదీని కలిసిన తర్వాత సీఎంతో కలిసి భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.
Mallu Bhatti Vikramarka Listening
రాష్ట్రంలో 14 రహదారులను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలని కోరుతూ ప్రతిపాదనలు పంపించామని ఇందులో కేవలం రెండింటికే ఆమోదం తెలిపారని ఇంకా 12 రహదారులను అప్ గ్రేడ్ చేయాలని కోరామని తెలిపారు. గిరిజన విశ్వ విద్యాలయంకు నిధులు పెంచాలని, ప్రవేశాలకు అనుమతి ఇవ్వాలని కోరామన్నారు.
బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, కాజీపేటలో అదనంగా కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని విన్నవించామన్నారు. హైదరాబాద్ లో ఐటీఐఆ్ ను వెంటనే పునరుద్దరించాలని విన్నవించామని పేర్కొన్నారు. వరంగల్ లో లోని కాకతీయ మెగా జౌళి పార్కుకు నిధులు ఇవ్వాలని కోరామని చెప్పారు భట్టి విక్రమార్క .
రాష్ట్రంలో ఐఐఎంను ఏర్పాటు చేయాలని, ఇందుకు తగిన స్థలం ఉందని మంజూరు చేస్తే తాము ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశామన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో సైనిక స్కూల్ ను ఏర్పాటు చేయాలన్నారు.
Also Read : CM Revanth Reddy : హామీలు నెరవేర్చండి నిధులు ఇవ్వండి