CM Revanth Reddy : హామీలు నెర‌వేర్చండి నిధులు ఇవ్వండి

సీఎం రేవంత్ రెడ్డి..డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క

CM Revanth Reddy : న్యూఢిల్లీ – పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న హామీలు నెర‌వేర్చాల‌ని, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల‌ను వెంట‌నే మంజూరు చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీని కోరారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కొత్త‌గా సీఎం, డిప్యూటీ సీఎంలుగా కొలువు తీరిన వీరిద్ద‌రూ మ‌ర్యాద పూర్వ‌కంగా పీఎంను క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్బంగా అప‌రిష్కృతంగా ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని విన్న‌వించారు.

CM Revanth Reddy Comment

పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా క‌ల్పించాల‌ని, పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న హామీలు నెర‌వేర్చాల‌ని న‌రేంద్ర మోదీని కోరారు. ఏపీలో పోల‌వ‌రం ప్రాజెక్టుకు జాతీయ హోదా క‌ల్పించార‌ని తెలంగాణ లోనూ పాల‌మూరు రంగారెడ్డికి జాతీయ హోదా క‌ల్పించాల‌ని సూచించారు.

ప‌లు స‌మ‌స్య‌ల‌ను పీఎం దృష్టికి తీసుకు వెళ్లారు. ఏపీ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం 2015 నుంచి 2021 వ‌ర‌కు ప్ర‌తి ఏటా రూ.450 కోట్లు చొప్పున రూ.2250 కోట్ల‌ను కేంద్రం విడుద‌ల చేసింద‌ని, 2019-20, 21-22, 22-23, 23-24 సంవ‌త్స‌రాల‌కు సంబంధించి పెండింగ్ గ్రాంట్లు రూ.1,800 కోట్లు విడుద‌ల చేయాల‌ని సీఎం, డిప్యూటీ సీఎం మోదీని కోరారు.

పెండింగ్ లో ఉన్న‌ 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.2233.54 కోట్లు (2022-23కు సంబంధించి రూ.129.69 కోట్లు, 2023-24కు సంబంధించి రూ.1608.85 కోట్లు) వెంట‌నే విడుద‌ల చేయాల‌ని విన్న‌వించారు.

Also Read : Telangana Assembly Comment : అసెంబ్లీ అంటే అరుపులేనా

Leave A Reply

Your Email Id will not be published!