TTD Chairman Bhumana : ఉద్యోగుల సంక్షేమం ముఖ్యం
టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి
TTD Chairman Bhumana : తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తులకు విశిష్ట సేవలు అందిస్తున్న సిబ్బంది, ఉద్యోగుల సంక్షేమమే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు . టీటీడీ చైర్మన్ గురువారం మీడియాతో మాట్లాడారు.
TTD Chairman Bhumana Comment
ప్రతి రోజూ లక్షలాది మంది స్వామి, అమ్మ వార్లను దర్శించు కునేందుకు వస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. పర్మినెంట్ , కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్దతిన దాదాపు 4 వేల మంది దాకా పని చేస్తున్నారని వెల్లడించారు భూమన కరుణాకర్ రెడ్డి.
టీటీడీ ఉద్యోగులతో విడదీయ రాని బంధం ఉందన్నారు. ముందు నుంచీ తిరుమలలో జీయర్ మఠాలు ఆచార, పూజా కైంకర్యాలను చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రస్తుతం ప్రతి ఏటా ఇస్తున్న నిధులను మరింత పెంచేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) పాలక మండలి తీర్మానం చేసిందన్నారు.
పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బందితో పాటు పదవీ విరమణ చేసిన టీటీడీ ఉద్యోగులకు ఇండ్ల స్థలాలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే వారికి అందజేస్తామని స్పష్టం చేశారు.
Also Read : AP ACB Court : లోకేష్ కు ఏసీబీ కోర్టు షాక్