Ram Gopal Varma : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలనంగా మారారు. తను వ్యూహం పేరుతో సినిమా తీశాడు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు వ్యతిరేకంగా టీడీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అంతే కాకుండా ఆర్జీవీ తల తీసుకు వచ్చిన వాళ్లకు రూ. 1 కోటి రూపాయలు బహుమానంగా ఇస్తామంటూ ప్రకటించడం కలకలం రేపింది.
Ram Gopal Varma Complaint Viral
దీంతో ఆర్జీవీ ఏపీ డీజీపీని కలిశారు. తనను చంపుతామంటూ కొందరు చేస్తున్న ప్రకటనల గురించి ఏకరవు పెట్టారు. ఈ మేరకు డీజీపీకి ఫిర్యాదు చేశారు. రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) వెంట నిర్మాత కూడా ఉన్నారు. అయితే ముంబై మాఫియాను తెర పై ఎక్కించేలా చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆర్జీవి ఇలా పోలీసులను ఆశ్రయించడం కలకలం రేపింది.
ఆర్జీవీని నటుడు నాగేంద్ర బాబు నిప్పులు చెరిగారు. విలన్ హీరో మధ్య వచ్చే కమెడియన్ ను ఎవరూ చంపుతారంటూ ప్రశ్నించారు. గత కొన్నేళ్ల నుంచి రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ , చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ను టార్గెట్ చేస్తూ వచ్చారు. వారిని పోలిన పాత్రలను తాజా మూవీ వ్యూహంలో పొందు పర్చడంపై భగ్గుమన్నారు.
మొత్తంగా ఆర్జీవీ సోషల్ మీడియాలో వైరల్ గా మారడం విస్తు పోయేలా చేసింది.
Also Read : Mallikarjun Kharge : ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు