Pawan Kalyan : మంగళగిరి – జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఉదారతను చాటుకున్నారు. ఆయన ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా పార్టీ కోసం పని చేసిన నేతలు, కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్నారు.
Pawan Kalyan Helps
అయితే ప్రమాద వశాత్తు మృతి చెందిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 11 మంది క్రియా శీలక జన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యాలయంలో మృతి చెందిన వారి చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం బాధిత కుటుంబాలలో ఒక్కో కుటుంబానికి జన సేన పార్టీ తరపున ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రూ. 5,00,000 రూపాయల చెక్కును స్వయంగా అందజేశారు. మొత్తం 55,00,000 రూపాయలు వారికి ఇచ్చారు.
ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పార్టీ కోసం పని చేసిన వారిని తాను తప్పకుండా గుర్తు పెట్టుకుంటానని అన్నారు. ఏ ఒక్కరు అధైర్య పడకుండా పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
జన సైనికులకు ఏ ఆపద వచ్చినా తాను ఆదుకుంటానని మాటిచ్చారు. రాబోయే రోజుల్లో మనం అధికారంలోకి రావాలని కోరారు.
Also Read : Rahul Gandhi : భారత్ న్యాయ యాత్రపై ఫోకస్