Skill University : జిల్లాకో స్కిల్ యూనివర్సిటీ
ప్రకటించిన రేవంత్ వరెడ్డి
Skill University : హైదరాబాద్ – రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల్లో స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సంచలన ప్రకటన చేశారు. సచివాలయంలో విద్యా శాఖపై సమీక్షించారు. కీలకమైన అంశాలను ఆయన ప్రస్తావించారు.
Skill University for Telangana
త్వరలోనే మెగా డీఎస్సీ నిర్వహించాలని ఇందు కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రారిశ్రామిక అవసరాలకు కావాల్సిన నైపుణ్యం గల ఉద్యోగాలను సాధించే విధంగా ఈ స్కిల్ యూనివర్సిటీలు ఉండాలని అన్నారు.
వీటిలో ఉపాధి ఆధారిత స్వల్ప కాలిక, దీర్ఘ కాలిక కోర్సులను ప్రవేశ పెట్టాలని సూచించారు సీఎం. ఇందుకు సంబంధించి గుజరాత్, హర్యానా, రాజస్థాన్, ఒరిస్సా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో ప్రస్తుతం ఉన్నస్కిల్ యూనివర్సిటీలను అధ్యయనం చేయాలని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.
కొడంగల్ నియోజక వర్గంతో పాటు తొమ్మిది జిల్లాల్లో ఈ స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని అన్నారు. ఇందుకు గాను విద్యా శాఖ, పరిశ్రమల శాఖ, కార్మిక శాఖల కార్యదర్శులతో ప్రత్యేక కమిటీ వేసి తగు ప్రతిపాదనలను సమర్పించాలని సీఎస్ ను ఆదేశించారు.
శాంతి కుమారి, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పాఠశాల విద్యా శాఖ కమీషనర్ దేవసేన, సి.ఎం.ఓ అధికారులు శేషాద్రి, షా-నవాజ్ ఖాసిం పాల్గొన్నారు.
Also Read : CM Revanth Reddy : మెగా డీఎస్సీకి సీఎం ఆదేశం