Arshia Goswami: 75 కేజీల బరువెత్తిన తొమ్మిదేళ్ల బాలిక !
75 కేజీల బరువెత్తిన తొమ్మిదేళ్ల బాలిక !
Arshia Goswami: కొందరు చిన్నారులు తమ ప్రతిభతో అరుదైన రికార్డులు సృష్టిస్తుంటారు. తాజాగా తొమ్మిదేళ్ల బాలిక అరుదైన ఘనత సాధించింది. ఏకంగా 70కి పైగా కేజీల బరువు ఎత్తి ఔరా అనిపించింది. హరియాణాలోని పంచకులకు చెందిన అర్షిక గోస్వామి(Arshia Goswami) చిన్న వయసులోనే తన బరువు కంటే రెట్టింపు కేజీలను ఎత్తి పలు రికార్డులు సాధించింది. తాజాగా 75 కేజీల బరువును ఎత్తి ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమెకు సంబంధించిన ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇప్పటివరకు రెండు మిలియన్లకు పైగా వీక్షించారు. చిన్నారి ప్రతిభను మెచ్చిన నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపించారు. ‘‘భారత్కు మరో స్వర్ణం దొరికింది’’ అని ఒకరు.. ‘‘చిన్నారి ప్రతిభకు మేమంతా ఫిదా’’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Arshia Goswami Viral
2021లో తన ఆరేళ్ల వయసులో 45 కేజీల బరువునెత్తి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకొంది అర్షిక గోస్వామి. దేశంలోనే ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కురాలిగా పేరు సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. తాను ఎత్తే బరువులకు సంబంధించిన వీడియోలను ఎప్పుటికప్పుడు సోషల్ మీడియోలో పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది.
Also Read : Arvind Kejriwal : ఢిల్లీ సీఎం పిటిషన్ పై హైకోర్టు తీర్పుకు సుప్రీంలో సవాల్