Ambati Murali Krishna: వైసీపీ అభ్యర్థికి బిగ్ షాక్ ? ఈసీ కీలక ఆదేశాలు !
వైసీపీ అభ్యర్థికి బిగ్ షాక్ ? ఈసీ కీలక ఆదేశాలు !
Ambati Murali Krishna: పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణకు ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ పొన్నూరు పట్టణంలో ధర్నా చేపట్టడంపై అంబటి మురళీకృష్ణపై కేసు నమోదైంది. దీనితో ఆయనపై చర్యలు తీసుకోవాలని… ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీన ఆదేశించారు.
Ambati Murali KrishnaGot EC Notice
ఈ నెల 13వ తేదీన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ… పొన్నూరు పట్టణంలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాపై తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి నివేదికను ఇవ్వాల్సిందిగా గుంటూరు కలెక్టర్ ను సీఈవో ఆదేశించారు. కలెక్టర్ విచారణలో అంబటి మురళీకృష్ణ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లు నిర్ధారించారు. దీనితో పొన్నూరు పట్టణ పోలీసులను కేసు నమోదు చేయాల్సిందిగా కలెక్టర్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. నాలుగు రోజుల క్రితమే పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీ కృష్ణ సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంచినట్లు కూడా నిర్ధారించారు. దీనితో చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ కు సీఈవో ఆదేశాలు జారీ చేశారు. అయితే వారం రోజులు గడవక ముందే మరోసారి అంబటి మురళిపై చర్యలకు ఆదేశించింది ఎన్నికల కమిషన్.
Also Read : Nallimilli Rama Krishna Reddy: బీజేపీలో చేరిన అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి !