YS Sharmila: మంత్రి బొత్సపై జగన్ చేసిన వ్యాఖ్యలకు షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ !
మంత్రి బొత్సపై జగన్ చేసిన వ్యాఖ్యలకు షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ !
YS Sharmila: మంత్రి బొత్స సత్యనారాయణ తనకు తండ్రి సమానులంటూ మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా విజయనగరం జిల్లాలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) ఘాటుగా స్పందించారు. దివంగత నేత రాజశేఖర రెడ్డి, ఆయన సతీమణి విజయమ్మతో పాటు జగన్ కు కూడా తిట్టిన బొత్స తనకు తండ్రి ఎలా అవుతాడని షర్మిల ప్రశ్నించారు. ఈ సందర్భంగా పలు సందర్భంగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై బొత్స సత్యనారాయణ చేసిన విమర్శలను ఆమె గుర్తు చేశారు.
YS Sharmila Comment
ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం బాపట్ల జిల్లా రేపల్లెలో జరిగిన న్యాయయాత్ర బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ… ‘‘బొత్స సత్యనారాయణ అనే ఆయనను పక్కన నిలబెట్టుకుని… ‘నాకు తండ్రి లాంటి వాడు, ఓట్లెయండి’ అని జగన్ అడుగుతున్నాడు. మీ సమక్షంలో అడుగుతున్నా… అసెంబ్లీలో వైఎస్ఆర్ను బొత్స సత్యనారాయణ తిట్టారు.. తాగుబోతు అన్నారు. జగన్ కు ఉరిశిక్ష వేయాలని వ్యాఖ్యానించారు. విజయమ్మను సైతం అవమాన పరిచారు. అలాంటి బొత్స జగన్‌కు తండ్రి సమానులు అయ్యారు.
జగన్ కేబినెట్లో ఉన్నవాళ్లంతా వైఎస్ఆర్ను తిట్టినవాళ్లే. వాళ్లంతా అతడికి తండ్రులు, అక్కలు, చెల్లెళ్లు. నిజంగా ఆయన కోసం పనిచేసిన వాళ్లు మాత్రం ఏమీ కారు. ఆయన కోసమే పనిచేసి గొడ్డలి పోటుకు గురై వాళ్లూ ఏమీ కారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో వైఎస్ఆర్ లేరు. వై అంటే వైవీ సుబ్బారెడ్డి.. ఎస్ అంటే సాయిరెడ్డి.. ఆర్ అంటే రామకృష్ణారెడ్డి’’ అని షర్మిల వ్యాఖ్యానించారు. తన తండ్రి రాజశేఖరరెడ్డిని తిట్టిన వారందరికీ జగన్ పెద్దపీట వెయ్యడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. పైగా వారినే పక్కన పెట్టుకుని తండ్రి లాంటి వారని సంభోదిస్తూ ఓట్లు అడగగాన్ని ఎద్దేవా చేశారు.
Also Read : Ramasahayam Raghuram Reddy: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సినీ హీరో వెంకటేశ్ వియ్యంకుడు !