Amanchi Krishna Mohan: చీరాల డీఎస్పీని చెట్టుకు కట్టేస్తాం – చీరాల కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి
చీరాల డీఎస్పీని చెట్టుకు కట్టేస్తాం - చీరాల కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి
Amanchi Krishna Mohan: బాపట్ల జిల్లా చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్… ఎన్నికల్లో ఏకపక్షంగా వ్యవహరిస్తూ తమను ఇబ్బంది పెడితే చెట్టుకు కట్టేస్తామని నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ హెచ్చరించారు. ఎమ్మెల్యే కరణం బలరాం అనుచరుడిగా డీఎస్పీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కఠారిపాలెంలో తనకు మద్దతు ఇస్తున్న మత్స్యకారుల ఇళ్లలో అవసరం లేకపోయినా కార్డన్‌సెర్చ్ నిర్వహించి వారిని భయాందోళనలకు గురి చేశారని ఆరోపించారు. ఈ మేరకు బాపట్ల కలెక్టరేట్ లో ఎన్నికల పరిశీలకుడు పరిమళసింగ్, పోలీసు పరిశీలకుడు అయ్యప్పలకు ఆమంచి ఫిర్యాదు చేశారు.
Amanchi Krishna Mohan Comment
అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికల్లో తనకు అనుకూలంగా పనిచేయటానికే ప్రసాద్ కు ఎమ్మెల్యే కరణం చీరాలలో పోస్టింగ్ ఇప్పించారని ఆరోపించారు. గత ఎన్నికలప్పుడు చీరాలలో సీఐగా ఉన్న ప్రసాద్… కరణం బలరాంకు అనుకూలంగా పనిచేశారని ఆరోపించారు. ‘కఠారిపాలేనికి చెందిన వెంకటేశ్వర్లు పొలం విక్రయించగా కొనుగోలుదారులు రూ.25 లక్షల నగదును చీరాల హెచ్డీఎఫ్సీ బ్యాంకులో జమచేశారు. వెంకటేశ్వర్లు విడతల వారీగా నగదు డ్రా చేసుకుని ఇంట్లో ఉంచుకున్నారు. వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేశ్ కు కాకుండా కఠారిపాలెం వాసులు తనకు మద్దతు ఇస్తున్నారన్న కక్షతో డీఎస్పీని కార్డన్‌సెర్చ్‌కు పంపి భయభ్రాంతులకు గురి చేశారు’ అని ఆమంచి ఆరోపించారు.
Also Read : Narendra Modi: జూన్ 4 తరువాత భారత విరోధులు పారిపోక తప్పదు – ప్రధాని మోదీ