Telangana Highcourt: బీసీ కులగణనపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు !
బీసీ కులగణనపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు !
Telangana Highcourt: బీసీ కులగణనపై తెలంగాణా ప్రభుత్వానికి హై కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల్లో బీసీ కుల గణన చేసి నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. బీసీ కులగణనపై బీసీ సంక్షేమ సంఘము రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు మంగళవారం న్యాయస్థానం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున నాగుల శ్రీనివాస్ యాదవ్ వాదనలు వినిపించారు. పిటిషన్ పై విచారణ ముగిసినట్లు హైకోర్టు ప్రకటించింది.
Telangana Highcourt Order..
బీసీ కులగణన చేపట్టాలని హైకోర్టులో 2019లో పిటిషన్ దాఖలైంది. బీసీ సంఘం నేత ఎర్ర సత్యనారాయణ ఈ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై మరోసారి సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. బీసీ కుల గణనపై సుప్రీంకోర్టు ఉత్తర్వులున్నాయని పిటిషనర్ పేర్కొనగా.. అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. దీంతో తాజా ఉత్తర్వులు ఇచ్చి.. పిటిషన్పై కోర్టు విచారణ ముగించింది. హైకోర్టు తీర్పు ప్రకారం ప్రభుత్వం మూడు నెలల్లో కులగణన చేయడం సాధ్యమేనా కోర్టును మళ్లీ సమయం అడుగుతుందా అన్నది తెలియాల్సి ఉంది.
Also Read : Nara Lokesh: లక్షల మంది జలసమాధి అయ్యేలా జగన్ కుట్ర – మంత్రి నారా లోకేశ్ ఆరోపణ