Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌ సీఎస్‌తో జూడాల రెండోవిడత చర్చలు

పశ్చిమ బెంగాల్‌ సీఎస్‌తో జూడాల రెండోవిడత చర్చలు

Mamata Banerjee: ఆర్జీ కర్‌ ఆసుపత్రి హత్యాచార వివాదానికి ముగింపు పలికే చర్యల్లో భాగంగా.. కోల్‌కతాలో గత కొన్నిరోజులుగా ఆందోళనలు చేస్తున్న జూనియర్‌ డాక్టర్లు రాష్ట్ర ప్రభుత్వంతో రెండోవిడత చర్చల నిమిత్తం బుధవారం సాయంత్రం ప్రధాన కార్యదర్శి మనోజ్‌ పంత్‌తో సమావేశమయ్యారు. ఈ చర్చల కోసం 30 మంది జూనియర్‌ వైద్యుల బృందం పోలీసు రక్షణతో సచివాలయానికి తరలివచ్చింది. రాత్రి 7.30కు మొదలైన సమావేశం పదింటిదాకా కొనసాగింది.

Mamata Banerjee Meeting

సోమవారం ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో జరిగిన భేటీలాగే జూనియర్‌ డాక్టర్లు సమావేశ వివరాల నమోదుకు స్టెనోగ్రాఫర్లను వెంటబెట్టుకు వచ్చారు. సానుకూల వాతావరణంలో జరిగిన ఈ చర్చల్లో జూడాల 8 డిమాండ్లకు గాను ఏడింటిని ప్రభుత్వం ఆమోదించింది. అయితే, ప్రధాన కార్యదర్శి మౌఖికంగా మాత్రమే తమకు హామీ ఇచ్చినందున ఆందోళన కొనసాగుతుందని చర్చల అనంతరం జూడాలు ప్రకటించారు. రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి ఎన్‌.ఎస్‌.నిగంను తొలగించి, విచారణ చేపట్టాలని వీరు గట్టిగా కోరుతున్నారు.

Also Read : KTR Slams : ప్రజలకు నాణ్యమైన వైద్యం అందలేదంటూ అధికార పార్టీపై బగ్గు మన్న కేటీఆర్

Leave A Reply

Your Email Id will not be published!