PM Narendra Modi: కశ్మీర్‌ యువత కు వాళ్లు రాళ్లు ఇస్తే మేం పెన్ను పుస్తకాలు ఇచ్చాం

కశ్మీర్‌ యువత కు వాళ్లు రాళ్లు ఇస్తే మేం పెన్ను పుస్తకాలు ఇచ్చాం

PM Narendra Modi: మూడు కుటుంబాలు జమ్ము కశ్మీర్‌ను దోచుకున్నాయని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం శ్రీనగర్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోదీ(PM Narendra Modi) పాల్గొని మాట్లాడారు. జమ్ము కశ్మీర్‌ను దోచుకోవటం తమ జన్మ హక్కు అన్నట్లు ఆ మూడు కుటుంబాలు ప్రవర్తిచాయి. మూడు పార్టీలు జమ్ము కశ్మీర్‌ యువత భవిష్యత్తు నాశనం చేశాయి. ఆ మూడు పార్టీలు కశ్మీర్‌ యువత చేతికి రాళ్లు ఇచ్చి విధ్వంసాలు సృష్టించేవి బీజేపీ మాత్రం పుస్తకాలు, పెన్స్‌ ఇస్తోంది.

PM Narendra Modi Comment

స్కూల్స్‌ను కూడా ఉగ్రవాదులు టార్గెట్‌​ చేశారంటే వారు ఎంత ద్వేషంతో ఉన్నారో అర్థం అవుతుంది. ఇప్పుడు జమ్ము​ కశ్మీర్‌ యువత చేతిలో రాళ్లు కాదు.. బుక్స్, పెన్నులు కనిపిస్తున్నాయి. ఎయిమ్స్‌, ఐఐటీ ఏర్పాటు వార్తలు ఇప్పుడు జమ్ములో వినిపిస్తున్నాయి. కశ్మీర్‌లో ఉపాధి అవశాలు లభించేలా ఏర్పాట్లు చేస్తున్నాం.

50 వేల మంది డ్రాపవుట్‌ విద్యార్థులను తిరిగి స్కూల్స్‌కు రప్పించాం. గతంలో లాల్‌చౌక్‌ దగ్గర ఉగ్ర దాడుల జరిగేవి. ఇప్పడు కశ్మీర్‌లో ఇంటర్నేషనల్‌ యోగా డే లాంటి కార్యక్రమాలు జరగుతున్నాయి. రైల్‌ కనెక్టివిటీ కూడా పెరగటం వల్ల టూరిజం, ఇతర రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. తొలివిడత ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. తొడి విడతలో ప్రజలు ఉత్సాహంగా ఓటు వేశారు అని మోదీ అన్నారు.

‘‘1980ల్లో ఏం జరిగిందో మర్చిపోయారా? ఆ మూడు పార్టీలు జమ్మూకశ్మీర్‌ను వారి సొంత సామ్రాజ్యంగా భావించాయి. ఆ మూడు కుటుంబాల వారు కాకుండా ఇంకెవర్నీ రాజకీయాల్లోకి రానిచ్చేవారు కాదు. విద్యకు దూరమైన మన యువత చేతిలో వారు రాళ్లు పెట్టారు. వారి స్వప్రయోజనాల కోసం మన పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు. జమ్మూకశ్మీర్‌ పై కుట్రలు చేసే ప్రతి శక్తినీ ఓడించి తీరుతాం’’ అని మోదీ అన్నారు.

Also Read : Amit Shah : జమ్మూ కాశ్మీర్ ఎన్నికల వేళ కేంద్ర హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు

Leave A Reply

Your Email Id will not be published!