Minister Sharan Prakash : సీజనల్ ఆరోగ్య సమస్యలకు ఐఎంఆర్ కొత్త లేబరేటరీ
రోగాల నిర్ధారణకు పరిశోధనల పెంపునకు..
Sharan Prakash : ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) దక్షిణభారత్‌లో తొలి సీజనల్ వ్యాధుల పరిశోధనల కోసం ప్రత్యేక ల్యాబ్ (ఐఆర్డీఎల్ఎస్)ను ప్రారంభించడం హర్షణీయమని రాష్ట్ర వైద్యవిద్యా శాఖా మంత్రి శరణప్రకాష్ పాటిల్ అభిప్రాయపడ్డారు. ప్రత్యేక ల్యాబ్‌ను బెంగళూరు మెడికల్ కళాశాలలో ఆరంభించేలా ఎంపిక చేశారని శుక్రవారం ప్రకటించారు. దక్షిణభారత దేశంలో తొలిసారిగా ఇటువంటి కేంద్రం బెంగళూరులో ప్రారంభం కానుందని మంత్రి అభిప్రాయపడ్డారు.
Minister Sharan Prakash Patil Comment
కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలకు చెందిన మెడికల్ కళాశాలలో సీజనల్ వ్యాధుల పరిశోధనలు, రోగనిర్ధారణలకు అనుబంధంగా ప్రత్యేక ల్యాబ్‌లను మంజూరు చేస్తోంది. బ్యాక్టీరియాలజీ, మైకాలజీ, ప్యారాసిటాలజీలకు సంబంధించి వైరస్ పరిశోధనలు, రోగనిర్ధారణ ప్రయోగాలయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రోగాల నిర్ధారణకు పరిశోధనల పెంపునకు అనుకూలం కానుందన్నారు. మన సామర్థ్యాన్ని అభివృద్ధి పెంచుకునేందుకు వీలు కల్పించినట్లు అవుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాధులు ప్రబలుతున్న తరుణంలో పరీక్షలు ఉపయోగకరమన్నారు.
Also Read : YS Sharmila : ఈడీ, సీబీఐ లాంటి సర్కార్ సంస్థలన్నీ బిజెపి చేతుల్లో..