KTR: కంచ గచ్చిబౌలి భూములపై ఎక్స్ ద్వారా ప్రధాని మోదీకు కేటీఆర్ విజ్ఞప్తి

కంచ గచ్చిబౌలి భూములపై ఎక్స్ ద్వారా ప్రధాని మోదీకు కేటీఆర్ విజ్ఞప్తి

KTR : తెలంగాణా రాజకీయాలను హీటెక్కించిన కంచ గచ్చిబౌలి భూముల విషయంపై ప్రధాని నరేంద్ర మోదీకు… బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక విజ్ఞప్తి చేశారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రధానిగా పర్యావరణంపై చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన సమయమిదన్నారు. ఈ మేరకు తన అఫీసియల్ సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’ ద్వారా ప్రధానిని ఆయన కోరారు.

KTR Appeal

‘‘కంచ గచ్చిబౌలి భూముల ఆర్థిక అక్రమాలపై విచారణ చేపట్టాలి. కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలి. దీనిపై ప్రధాని వ్యాఖ్యలకే పరిమితం కాకుండా చర్యలు తీసుకోవాలి. కంచ గచ్చిబౌలి అంశం వందల ఎకరాల పర్యావరణ విధ్వంసం మాత్రమే కాదు… కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన రూ.10 వేల కోట్ల ఆర్థిక మోసం. దీనిపై ఇప్పటికే దర్యాప్తు సంస్థలకు ఆధారాలతో సహా తెలిపాం. ఆర్థిక అవకతవకల అంశాన్ని కేంద్ర సాధికార కమిటీ నిర్ధరించింది. స్వతంత్ర విచారణ చేయాలని సూచించింది. దీనిపై వెంటనే కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలి’’ అని కేటీఆర్‌ తన ట్వీట్ ద్వారా ప్రధాని మోదీను కోరారు.

Also Read : Leopard: ఇక్రిశాట్‌లో బంధించిన చిరుతను జూకు తరలించిన అధికారులు

Leave A Reply

Your Email Id will not be published!