Prashant Kishor: ప్రశాంత్ కిషోర్‌పై బీహార్ మంత్రి పరువునష్టం కేసు

ప్రశాంత్ కిషోర్‌పై బీహార్ మంత్రి పరువునష్టం కేసు

Prashant Kishor : ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ పై బీహార్ మంత్రి, జేడీయూ సీనియర్ నేత అశోక్ చౌదరి పరువునష్టం కేసు వేశారు. అశోక్‌ చౌదరి గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తన కుమార్తె శాంభవికి ఎంపీ టికెట్‌ కోసం లోక్‌జన శక్తి పార్టీ (రామ్‌ విలాస్‌) అధ్యక్షుడు, కేంద్ర మంత్రి చిరాగ్‌ పాశ్వాన్‌కు లంచం ఇచ్చారంటూ ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనితో తనపై అసత్యపు ఆరోపణలు చేసి, తన పరువు నష్టం కలిగించినందుకు ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై చౌదరి పరువునష్టం కేసు వేశారు. చౌదరి కుమార్తె శాంభవి లోక్‌ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) సమస్టిపూర్ రిజర్వ్‌డ్ నియోజకవర్గం ఎంపీగా ఉన్నారు.

Bihar Defamation Case on Prashant Kishor

ప్రశాంత్ కిషోర్ తనపైన, తన కుమార్తె పైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో లీగల్ నోటీసు పంపానని, ఆయన పంపిన సమాధానం సంతృప్తికరంగా లేదని, ఆయనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని చాలా స్పష్టంగా తేలిందని చౌదరి చెప్పారు. అందుకే లీగల్ చర్యలకు దిగినట్టు తెలిపారు. చిరాగ్ పాశ్వాన్‌కు తాను డబ్బులిచ్చినట్టు ప్రశాంత్ కిషోర్ నిరూపించడం కానీ, తన ఆరోపణలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పడం కానీ చేయాలని అన్నారు. దీనిపై అవసరమైతే సుప్రీంకోర్టు వరకూ వెళ్తానని చౌదరి స్పష్టం చేశారు.

ప్రశాంత్ కిషోర్ ఇంతకుముందు పోల్ స్ట్రాటజిస్ట్‌గా జేడీయూతో కొద్దికాలం పనిచేశారని, పొలిటకల్ ట్రేడర్‌ గా డబ్బులు తీసుకుని ఆయన పలు పార్టీలకు సేవలందించారని చౌదరి గుర్తుచేశారు. అయితే తాము మాత్రం పూర్తిగా రాజకీయాల్లో ఉన్నామని, తాను రెండో తరం పొలిటీషియన్‌నని చెప్పారు. తన కుమార్తె అతి చిన్న వయస్సులో ఎంపీ అయ్యారని అన్నారు. దళిత అమ్మాయికి ఇలాంటి గౌరవం దక్కడం ప్రశాంత్ కిషోర్ జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. చౌదరి తండ్రి మహావీర్ చౌదరి తండ్రి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేశారు.

Also Read : World Poorest Countries: ప్రపంచంలో అత్యంత పేద దేశాల జాబితా విడుదల చేసిన ఫోర్బ్స్ ఇండియా

Leave A Reply

Your Email Id will not be published!