Voter ID: ఇక నుండి 15 రోజుల్లో ఓటరు గుర్తింపు కార్డు

ఇక నుండి 15 రోజుల్లో ఓటరు గుర్తింపు కార్డు

Voter ID : ఎలక్టర్‌ ఫొటో ఐడెంటిటీ కార్డు(ఎపిక్‌)ను ఓటర్లకు చేరవేసే విషయంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. 15 రోజుల్లోగానే ఈ కార్డులు (Voter ID) సంబంధిత ఓటర్లకు చేరేలా చర్యలు తీసుకోనున్నట్లు బుధవారం వెల్లడించింది. ప్రస్తుతం ఈ కార్డుల డెలివరీకి నెల రోజులకుపైగా సమయం పడుతోంది. ఇప్పుడు ఈ సమయం సగానికి తగ్గిపోనుంది. ఇందుకోసం నూతన ప్రామాణిక నియమావళిని ఎన్నికల సంఘం రూపొందించింది. కొత్తగా ఓటర్‌గా పేరు నమోదు చేసుకున్న తర్వాత లేదా ప్రస్తుతం ఉన్న కార్డులో మార్పులు చేర్పులు చేసుకున్న తర్వాత 15 రోజుల్లోగా నూతన ఫొటో గుర్తింపు కార్డు ఓటర్లకు అందనుంది.

Voter ID – ఓటరు గుర్తింపు కార్డు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం ఎలాగో తెలుసా

1. ముందుగా voters.eci.gov.in వైబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
2. న్యూ రిజిస్ట్రేష‌న్ ఫ‌ర్ జ‌న‌ర‌ల్ ఎల‌క్ట‌ర్స్‌లో ‘ఫిల్ ఫామ్ 6’పై క్లిక్ చేయండి.
3. ఫిల్ ఫామ్ 6పై క్లిక్ చేయ‌గానే లాగిన్ అడుగుతుంది.
4. కొత్త యూజ‌ర్లు మొబైల్ నంబర్, ఇమెయిల్ ID, క్యాప్చా కోడ్ ఎంట‌ర్ చేయాలి.
5. త‌ర్వాత మీ మొబైల్‌కు ఓటీపీ వ‌స్తుంది.

6. మీ పేరు, పాస్‌వర్డ్ ఎంట‌ర్ చేసి OTPని నమోదు చేయండి.
7. ఇప్పుడు ఫిల్ ఫామ్ 6పై క్లిక్ చేస్తే.. లింక్ ఓపెన్ అవుటుంది.
8. ఫామ్ 6లో మీ రాష్ట్రం, జిల్లా, నియోజ‌వ‌ర్గం వివ‌రాలు న‌మోదు చేయాలి.
9. మీ పూర్తి పేరు వివ‌రాల‌తో పాటు పాస్‌పోర్ట్‌ ఫొటో అప్‌లోడ్ చేయాలి.
10. ఫోన్, ఆధార్ నంబ‌రు, జెండ‌ర్‌, పెట్టిన‌తేదీ, చిరునామాల‌తో పాటు సంబంధిత ప‌త్రాలు అప్‌లోడ్ చేయాలి.

ఈ వివ‌రాలు అన్ని న‌మోదు చేసిన త‌ర్వాత దరఖాస్తును ప్రివ్యూలో చూసుకోవాలి. అన్ని వివ‌రాలు కరెక్టుగా ఉన్నాయ‌ని భావిస్తే స‌బ్మిట్ చేయాలి. 15 రోజుల్లోగానే ఎలక్టర్‌ ఫొటో ఐడెంటిటీ కార్డు మీరు పొందుతారు.

Also Read : Kedarnath: కేదార్‌నాథ్ లో కర్రలతో కొట్టుకున్న యాత్రికులు

Leave A Reply

Your Email Id will not be published!