PM Narendra Modi: 8 రోజుల విదేశీ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ

8 రోజుల విదేశీ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ

Narendra Modi : ప్రధాని మోదీ జులై 2 నుంచి 9 వరకు విదేశాల్లో పర్యటిస్తారు. ఘనా, ట్రినిడాడ్‌-టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాల్లో ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధాని మోదీ ఎనిమిది రోజుల పాటు ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాల్లో ప్రధానమంత్రి పర్యటిస్తారని కేంద్ర విదేశాంగలోని ఆర్థిక సంబంధాల కార్యదర్శి దమ్ము రవి తెలిపారు. జులై 2, 3 తేదీల్లో మోదీ (Narendra Modi) ఘనాలో ఉంటారు. మూడు దశాబ్దాల తర్వాత ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే ప్రథమం. వ్యవసాయం, వ్యాక్సిస్ డవలప్‌మెంట్, ఘనాలో వ్యాక్సిన్ హబ్ ఏర్పాటు, రక్షణ రంగంలో సహకారం వంటివి ప్రధానంగా చర్చిస్తారు.

PM Narendra Modi Foreign Tour

3, 4 తేదీల్లో ప్రధాని ట్రినిడాడ్‌-టొబాగోలో పర్యటించనున్నారు. 1999 తర్వాత ఈ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. 4నే అర్జెంటీనాకు వెళ్లనున్న ప్రధాని మోదీ… మరుసటిరోజూ అక్కడే ఉంటారు. రక్షణ, వ్యవసాయం, గనులు, చమురు, పునరుత్పాదక ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడుల రంగాల్లో ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించే అంశంపై అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్‌ మిలేతో చర్చలు జరుపుతారు.

అనంతరం బ్రెజిల్‌ వెళ్తారు. ఆ దేశంలోని రియో డీ జనీరో వేదికగా 6-7 తేదీల్లో జరిగే బ్రిక్స్‌ 17వ సదస్సులో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో పహల్గాం దాడి ఘటనను బ్రిక్స్ 17వ సదస్సు ఖండించనుంది. భారత్‌ ప్రతిపాదన మేరకు ఒక తీర్మానం చేయనుంది. ప్రధాని 9న నమీబియాకు వెళ్లి… ద్వైపాక్షిక చర్చలతో పాల్గొనడంతోపాటు పార్లమెంటులోనూ ప్రధాని ప్రసంగిస్తారు. ఆ దేశ పార్లమెంటులోనూ ప్రసంగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత 11 ఏళ్లలో మోదీ సుదీర్ఘ దౌత్య పర్యటనల్లో ఇదొకటి కానుంది.

Also Read : Tej Pratap Yadav: అనుష్కను కలుసుకున్న ఆర్జేడీ బహిష్కృత నేత తేజ్ ప్రతాప్ యాదవ్

Leave A Reply

Your Email Id will not be published!