Bhagawan Sathya Sai Baba: సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు ప్రధాని మోదీకి ఆహ్వానం
సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు ప్రధాని మోదీకి ఆహ్వానం
Bhagawan Sathya Sai Baba : భగవాన్ శ్రీసత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు హాజరు కావాలని ట్రస్ట్ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్, ఇతర ట్రస్టీలు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, ర్యుకోహీరా, ఎస్‌ఎస్ నాగానంద్, నిమీష్ పాండ్యలు పార్లమెంటు భవన్ లో ప్రధానిని కలిశారు. నవంబరు 23 నుంచి ప్రారంభం కానున్న ఉత్సవాల గురించి ట్రస్ట్ సభ్యులు ప్రధానికి వివరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకు ఆహ్వాన పత్రాన్ని అందించారు.
Bhagawan Sathya Sai Baba – భారీ వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత
భారీ వర్షాల కారణంగా ఆదివారం వరకు అమర్‌నాథ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. పహల్గాం మార్గాన్ని ఇప్పటికే మూసివేసిన అధికారులు శుక్రవారం ఉదయం బల్తాల్ గుండా భక్తులను అనుమతించారు. అయితే వర్షాలు భారీగా కురియడంతో పరిస్థితిని సమీక్షించి బల్తాల్ తోవనూ మూసివేయాలని నిర్ణయించారు. జమ్మూ బేస్ క్యాంప్ భగవతీ నగర్ నుంచి రెండో రోజూ భక్తులను అనుమతించలేదు.
Also Read : Consumer Court of India: హనీమూన్ కి వెళ్లిన దంపతుల మృతి ! పర్యాటక సంస్థకు రూ.1.60 కోట్ల జరిమానా !
