KTR : జంట నగరాల్లో బస్సు ఛార్జీల పెంపు నిర్ణయం దుర్మార్గమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి అధ్యక్షుడు కేటీఆర్ (KTR) విమర్శించారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’లో ఓ పోస్టు చేశారు. సిటీ బస్సు ఛార్జీలను ఏకంగా రూ.10 పెంచారని చెప్పారు. పేద, మధ్యతరగతి ప్రయాణికుల జేబులను కొల్లగొట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారన్నారు. ఛార్జీల పెంపుతో ప్రతి ప్రయాణికుడిపై నెలకు రూ.500 అదనపు భారం పడుతుందని పేర్కొన్నారు. బడుగు జీవులు ఎలా బతకాలో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
KTR Slams CM Revanth Reddy
‘‘ఇప్పటికే విద్యార్థుల బస్సు పాసులు, టీ-24 టికెట్ ఛార్జీలను పెంచారు. కనీస ఛార్జీలపై 50 శాతం ధర పెంచడం అసమర్థ విధానాలకు నిదర్శనం. సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్ ప్రజలపై కక్ష పెంచుకున్నారు. ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీ దివాలా తీసింది. సంస్థను గట్టెక్కించాల్సిందిపోయి సామాన్యుల నడ్డి విరుస్తున్నారు’’ అని కేటీఆర్ విమర్శించారు.
బాల్య స్నేహితురాలికి పరామర్శ కోసం చింతమడకకు కవిత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన చిన్ననాటి స్నేహితురాలు వెంకటలక్ష్మిని పరామర్శించారు. ఇటీవల ఆమె భర్త మల్లారెడ్డి మృతి చెందడంతో చింతమడకకు వచ్చిన కవిత… కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ‘‘20 రోజుల వ్యవధిలోనే రెండోసారి చింతమడకకు రావాల్సి వచ్చింది. ఈ విషాద సమయంలో నా బాల్య మిత్రురాలిని ఓదార్చడం… స్నేహితురాలిగా భరోసా ఇవ్వడం నా బాధ్యత.
20 రోజుల క్రితం బతుకమ్మ పండగకు వచ్చినప్పుడు గ్రామ ప్రజలంతా పెద్దఎత్తున స్వాగతం పలికారు. వెంకటలక్ష్మి, బాలమణిలతో కలిసి చిన్నప్పుడు బతుకమ్మ ఆడుకున్న రోజులను గుర్తుచేసుకున్నాం. ఆడబిడ్డకు భర్తను కోల్పోవడాన్ని మించిన దుఃఖం ఇంకొకటి ఉండదు. ఈ కష్టం నుంచి ఆమె బయటపడాలని, కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’’ అని కవిత పేర్కొన్నారు.
Also Read : Khusbhu Sundar: కరూర్ తొక్కిసలాట ఘటనపై కుష్బు సంచలన ఆరోపణలు
