President Award Interesting : తెలంగాణ విద్యార్థికి ఎన్‌ఎస్‌ఎస్‌ అవార్డు

తెలంగాణ విద్యార్థికి ఎన్‌ఎస్‌ఎస్‌ అవార్డు

President Award : తెలంగాణకు చెందిన వంగపల్లి మణిసాయివర్మ జాతీయ సేవా పథకం అవార్డు పొందారు.  దిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Award) చేతుల మీదుగా 2022-23 సంవత్సరానికి సంబంధించి ‘మై భారత్‌- నేషనల్‌ సర్వీస్‌ స్కీం (ఎన్‌ఎస్‌ఎస్‌)’ అవార్డు అందుకున్నారు. సీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన ఈ ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థి… ప్రధానమంత్రి జీవన్‌బీమా యోజన, డిజిటల్‌ ఇండియా, స్వచ్ఛభారత్, క్యాష్‌లెస్‌ ఇండియా లాంటి విభిన్న పథకాల గురించి విస్తృత ప్రచారం నిర్వహించి గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. 504 మొక్కలు నాటారు. వ్యక్తిగతంగా రెండు యూనిట్ల రక్తదానం చేశారు. 40కి పైగా ఆరోగ్య, టీకా శిబిరాల్లో పాల్గొని ప్రజలకు సేవలందించారు. ఇందుకుగాను మణిసాయివర్మకు అవార్డుతోపాటు రూ.లక్ష నగదు, ప్రశంసాపత్రం అందజేశారు.

President Award – క్షయ రహిత భారత్‌ సాకారం కావాలి – గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ

భారత్‌లో క్షయ వ్యాధి ప్రజారోగ్యానికి పెను సవాలు విసురుతోందని, పోషకాహార లోపం వల్ల తలెత్తే ఈ జబ్బును సమర్థంగా కట్టడి చేయాలని రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అన్నారు. దేశంలో క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలని ఆకాంక్షించారు. సోమవారం రాజ్‌భవన్‌లో 76వ టీబీ సీల్‌ క్యాంపెయిన్‌ ప్రచార కార్యక్రమాన్ని గవర్నర్‌ లాంఛనంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ‘టీబీ ముక్త్‌ భారత్‌’ అంటే కేవలం కట్టడి చేయడం కాదని, పూర్తిగా నిర్మూలించడమని అభిప్రాయపడ్డారు. టీబీపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించాలని కోరారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద రాష్ట్రంలో పలు సంస్థల నిధులతో ప్రతి జిల్లాలో టీబీ నిర్ధారణకు మొబైల్‌ ఎక్స్‌రే యంత్రాలను వినియోగిస్తుండడాన్ని గవర్నర్‌ ప్రశంసించారు. గవర్నర్‌ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్, రాజ్‌భవన్‌ సీనియర్‌ అధికారి బి.సాయి బాబు, రాష్ట్ర టీబీ కార్యక్రమ ప్రధాన కార్యదర్శి బాలచంద్ర, టీబీ సంయుక్త సంచాలకుడు రాజేశం పాల్గొన్నారు.

Also Read : Lawyer Rakesh Kishore: దేవుడే సీజేఐపై నాతో దాడి చేయించాడు – రాకేశ్‌ కిశోర్‌

Leave A Reply

Your Email Id will not be published!