సీఎం చంద్రబాబుతోనే రాష్ట్రానికి భవిష్యత్తు

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

పెనుకొండ/శ్రీసత్య సాయి జిల్లా : సీఎం చంద్రబాబు నాయుడితోనే రాష్ట్రానికి భవిష్యత్తు అని, తన విజనరీ నాయకత్వంతో ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలపుతున్నారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు. 76 ఏళ్ల నవ యువకుడిలా ఏపీ అభివృద్ధికి ఆయన రేయింబవళ్లు కృషి చేస్తున్నారన్నారు. చంద్రబాబు అంటేనే నిజాయితీకి, నిబద్ధతకు నిలువుటద్దమన్నారు. సీఎం చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజక వర్గ కేంద్రంలో సోమవారం మంత్రి సవిత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కియా పరిశ్రమ ఎదుట 76 కేజీల కేక్ ను కట్ చేశారు. అంతకు ముందు పెద్ద చెరువు కట్ట ఆంజనేయస్వామి దేవాలయం ఎదుట 76 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. సీఎం చంద్రబాబుకు పెనుకొండ నియోజక వర్గ ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియ జేశారు.

చిన్ననాటి నుంచే సామాజిక సేవల పట్ల ఆసక్తి ఉండే చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రవేశం చేశారన్నారు. 1978లో చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారని, తన 28వ ఏటే ఆనాటి ముఖ్యమంత్రి అంజయ్య మంత్రి వర్గంలో సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ మంత్రిగా తనదైన ముద్ర వేశారన్నారు. అన్న ఎన్టీఆర్ టీడీపీని ప్రారంభిస్తే, క్షేత్ర స్థాయిలోకి పార్టీని తీసుకెళ్లి బలోపేతం చేసిన ఘనత‌ సీఎం చంద్రబాబు దేనన్నారు. నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారన్నారు. సీబీఎన్ బ్రాండ్ ఇమేజ్ తోనే ఏపీకి అత్యధిక పెట్టుబడులు, భారీ పరిశ్రమలు తరలి వ‌స్తున్నాయ‌న్నారు. పెనుకొండలో అంతర్జాతీయ పరిశ్రమ కియా ను స్థాపించి, లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపారన్నారు.

రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తూ, ఏపీని నెంబర్ వన్ తీర్చి దిద్తుతున్నారన్నారు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో సీఎం చంద్రబాబుదే ప్రధాన పాత్ర అని అన్నారు. ఒకవైపు రాయలసీమను సస్య శ్యామలం చేస్తూనే పారిశ్రామిక హబ్ గా, హార్టీకల్చర్ హబ్ గా, డ్రోన్ హబ్ గా అభివృద్ధి చేస్తున్నారని మంత్రి సవిత కొనియాడారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో పనిచేయడం, ఆయన క్యాబినెట్ లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం తన పూర్వ సుకృత మన్నారు

Leave A Reply

Your Email Id will not be published!