హిట్‌మ్యాన్ సెన్సేష‌న్ ముంబై ఇండియ‌న్స్ విక్ట‌రీ

6 వికెట్ల తేడాతో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ విజ‌యం

ముంబై : ఐపీఎల్ 2026లో వ‌రుస ప‌రాజ‌యాల‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న హార్దిక్ పాండ్యా సార‌థ్యంలోని ముంబై ఇండియ‌న్స్ అద్భుత విజ‌యాన్ని సాధించింది. ఎవ‌రూ ఊహంచ‌ని రీతిలో క‌మ్ బ్యాక్ రావ‌డం ఆ జ‌ట్టు ఫ్యాన్స్ సంతోష ప‌డేలా చేసింది. తాజాగా స్వంత గ‌డ్డ ముంబై లోని వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తో జ‌రిగిన కీల‌క పోరులో ముంబై ఇండియ‌న్స్ సూప‌ర్ షో చేసింది. గాయం కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఆట‌కు దూరంగా ఉన్న మాజీ కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ దుమ్ము రేపాడు. త‌ను 44 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని స‌త్తా చాటాడు. 6 ఫోర్లు 7 సిక్స‌ర్లతో 84 ర‌న్స్ చేశాడు. ముంబై ఇండియ‌న్స్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. మ‌రో వైపు ఓపెన‌ర్ ర్యాన్ రెకెల్ట‌న్ సూప‌ర్ షో చేశాడు.

32 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 83 ప‌రుగులు చేసి దంచి కొట్టాడు. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశాడు. రోహిత్, రెకెల్ట‌న్ ఇద్ద‌రూ క‌లిసి రికార్డు భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విరిచుకు ప‌డ్డారు. దీంతో 6 వికెట్ల తేడాతో గెలుపు సాధించింది. అంత‌కు ముందు మైదానంలోకి దిగింది. విండీస్ స్టార్ హిట్ట‌ర్ నికోల‌స్ పూర‌న్ 21 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ 8 సిక్స‌ర్ల‌తో దంచికొట్టాడు. 63 ప‌రుగులు చేశాడు. మిచెల్ మార్ష్ 25 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో 44 ర‌న్స్ చేశాడు. హిమ్మ‌త్ సింగ్ 31 బంతులు ఎదుర్కొని 40 ప‌రుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 2 ఫోర్లు 2 సిక్స‌ర్లు కొట్టాడు. దీంతో 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 228 ర న్స్ చేసింది. ఈ ఓట‌మితో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్టు ప్లే ఆఫ్ రేసు నుంచి దాదాపు నిష్క్ర‌మించింది.

Leave A Reply

Your Email Id will not be published!