స‌న్ రైజ‌ర్స్ షాన్ దార్ షో పంజాబ్ కు షాక్

పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర స్థానంలోకి హైద‌రాబాద్

హైద‌రాబాద్ : ఐపీఎల్ 2026 మెగా టోర్నీలో భాగంగా ఉప్ప‌ల్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క పోరులో అద్భుత‌మైన ప్ర‌తిభ‌ను చాటింది. ఆల్ రౌండ్ షోతో అదుర్స్ అనిపించింది. బ‌ల‌మైన పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ కు షాక్ ఇచ్చింది. పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానానికి చేరుకుంది ఎస్ ఆర్ హెచ్. అటు బౌలింగ్ లో ఇటు బౌలింగ్ లో సత్తా చాటింది. వ‌రుస‌గా ఇది ఆ జ‌ట్టుకు 9వ విజ‌యం కావ‌డం విశేషం. విచిత్రం ఏమిటంటే 10సార్లు ఓడించింది. కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ చేతిలో ఓట‌మి పాలైంది హైద‌రాబాద్. ఇప్ప‌టి దాకా 14 పాయింట్లు సాదించింది. ఈ మ్యాచ్ లో పూర్తిగా ఏక‌ప‌క్షంగా సాగింది.

ముందుగా బ్యాటింగ్ కు దిగింది స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ . జ‌ట్టు బ్యాట‌ర్లు చెల‌రేగి పోయారు. హెన్రిచ్ క్లాసెన్ 43 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు 4 సిక్సుల‌తో 69 ర‌న్స్ చేశాడు. ఇషాన్ కిష‌న్ 32 బంతుల్లో 55 ర‌న్స్ చేశాడు. ఇందులో 2 ఫోర్లు 4 సిక్సులు ఉన్నాయి. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 235 ర‌న్స్ చేసింది. అనంత‌రం 236 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ 7 వికెట్లు కోల్పోయి 202 ర‌న్స్ చేసింది. కూప‌ర్ క‌నోలి 59 బంతులు ఎదుర్కొని సూప‌ర్ సెంచ‌రీ చేశాడు. త‌ను 107 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 7 ఫోర్లు 8 సిక్స‌ర్లు ఉన్నాయి. త‌ను శ‌త‌కం చేసినా జ‌ట్టును గ‌ట్టెక్కించ లేక పోయాడు. సూప‌ర్ స‌త్తా చాటిన కమిన్స్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఇక ఈ సీజన్‌లో హైదరాబాద్‌కు ఇది ఏడో విజయం కాగా కింగ్స్‌కు హ్యాట్రిక్‌ పరాభవం.

Leave A Reply

Your Email Id will not be published!