ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఇసుక స‌ర‌ఫ‌రా

స్ప‌ష్టం చేసిన మంత్రి కొల్లు ర‌వీంద్ర

అమ‌రావ‌తి : గనుల రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ఇసుక సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు రాష్ట్ర గ‌నులు, భూగ‌ర్భ వ‌న‌రులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు ర‌వీంద్ర‌. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం సి. బెలగల్ మండలం ముడుమాల గ్రామంలోని ఇసుక రీచ్ ని కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరితో కలసి మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. అనంతరం కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో మైన్స్ అండ్ జియాలజీ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. మైనింగ్‌కు సంబంధించి గత ఐదేళ్లలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ తో పాటు, పర్మిషన్స్ (ఈసీ పర్మిషన్స్ వంటివి) త్వరితగతిన ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

మైనింగ్ రంగంలో ఎక్కువ శాతం మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉందన్నారు. ప్రధానంగా ఇసుకకు సంబంధించి గత 5 ఏళ్లలో వ్యవస్థ అస్తవ్యస్తమైందన్నారు. భవన నిర్మాణ రంగం కుదేలయిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నష్టపోయినా పర్వాలేదు కానీ, ప్రజలకు ఇసుక అందుబాటులో ఉంచాలని ఉచిత ఇసుక పాలసీ అమలు కు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారన్నారు. ప్రతి సంవత్సరం సగటున ప్రభుత్వానికి రావాల్సిన 300 కోట్ల రూపాయలు ఆదాయం తగ్గిపోయినా, ప్రజలకు ఇసుక సరఫరా లో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో ఇసుక కొరత లేకుండా చూడాలన్నారు.

ఎన్జీటీ పర్మిషన్స్ ఇవ్వడంలో, ఈసీ పర్మిషన్స్ ఇవ్వడంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. మైనింగ్ లో “వ్యాల్యూ ఎడిషన్ (Value addition) కి వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమలకు సంబంధించి ఇవాళ భారతదేశంలో వచ్చిన పెట్టుబడులలో 25% పెట్టుబడులు ఒక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయన్నారు. గూగుల్ (Google), ఆర్సెలార్ మిట్టల్ (ArcelorMittal), మొన్ననే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఫెన్స్ ప్రాజెక్ట్ కి సంబంధించి రాకెట్ మ్యానుఫ్యాక్చరింగ్స్ , పుట్టపర్తి లో రక్షణ రంగానికి చెందిన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారన్నారు. కర్నూలు జిల్లాలో డ్రోన్ సిటీ, రిలయన్స్ తదితర పరిశ్రమలు వచ్చాయన్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మైనింగ్ రంగ అభివృద్ధికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

Leave A Reply

Your Email Id will not be published!