2029 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మహిళలకు 33 శాతం సీట్లు
ఇది మా సంకల్పం... మా బాధ్యత...మా కమిట్ మెంట్
అమరావతి: పార్లమెంట్ లో మహిళా బిల్లు పెడితే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి… మన స్త్రీశక్తికి మరింత బలం ఇవ్వాలని చూస్తే దానికి ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయి. ఇప్పుడు ఒక ప్రతిపాదన చేస్తున్నాను. పార్లమెంట్ లో బిల్ పాస్ అయినా, అవ్వక పోయినా మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి… వచ్చే ఎన్నికల్లో 33% సీట్లు మహిళలకు ఇవ్వాలి… ఈ పవిత్ర మహానాడు వేదిక నుండి తాను ఈ ప్రతిపాదన చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు, యువనేత నారా లోకేష్ ప్రకటించారు. యువనేత లోకేష్ ప్రవేశపెట్టిన ఈ చారిత్మాత్మక తీర్మానంతో మహానాడు వేదిక మారుమోగింది. మహానాడు ప్రారంభం సందర్భంగా యువనేత లోకేష్ మాట్లాడుతూ… రాష్ట్రంలో 2029 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మహిళలకు 33% సీట్లను కేటాయించాలి. ఇది కేవలం ఒక నినాదంగా కాదు.. భారతదేశ భవిష్యత్తు పట్ల ఒక నిబద్ధతగా ఉండాలి. మాకు మరింత మంది మహిళా చట్టసభ సభ్యులు కావాలి… మరింత మంది మహిళా నాయకులు కావాలి… మరింత మంది మహిళా విధాన నిర్ణేతలు కావాలి. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును మహిళలు భుజం భుజం కలిపి నడిపిస్తారు. ఇది మా సంకల్పం…ఇది మా బాధ్యత…ఇది మా కమిట్ మెంట్ అని అన్నారు
భారత రాజకీయాల తదుపరి శకం మహిళా నాయకత్వానిదే కావాలని నేను గట్టిగా నమ్ముతున్నాను అని అన్నారు నారా లోకేష్ . మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకు రావడం ద్వారా ఎన్డీయే ఒక చారిత్రాత్మక అడుగు వేసింది. మా దృక్పథం స్పష్టం. మహిళలు కేవలం లబ్ధిదారులుగా మాత్రమే మిగిలి పోకూడదు… మహిళలు నిర్ణయాలు తీసుకునే వారుగా మారాలి. దురదృష్టవశాత్తు, ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లును తిరస్కరించి, మహిళా సాధికారతకు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించాయి. ఎన్నికల సమయంలో చాలా పార్టీలు మహిళా సాధికారత గురించి మాట్లాడతాయి. కానీ ఎన్నికల తర్వాత మహిళలను మర్చిపోతాయి. కానీ తెలుగుదేశం పార్టీ సూత్రప్రాయంగా, ఆచరణలో మహిళా సాధికారతను విశ్వసిస్తోంది. ఇతరులు మద్దతిచ్చినా, మద్దతు ఇవ్వక పోయినా… పార్లమెంట్ అమలు చేసినా చేయక పోయినా… మనం ముందుండి నడిపించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళ. కొంతమంది మహిళలను అవమానపరిచేలా మాటలు మాట్లాడతారు. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలా ఏడవొద్దు అంటూ మహిళలను తక్కువచేసి మాట్లాడతారు. అలాంటి మాటలు ఎవరూ మాట్లాడకూడదు అని మనం ముందుండి పోరాడాలి. స్కూల్ బుక్స్ లో ఇంటి పనులు చేసే బొమ్మలు అన్నీ మహిళలవే ఉంటే 50 – 50 ఉండాలని ఆదేశించాను.
