ఏపీకి రియ‌ల్ బ్రాండ్ అంబాసిడ‌ర్ సీబీఎన్

ఆయ‌న‌పేరు చెబితే ప్రపంచ వ్యాప్తంగా గౌరవం

అమ‌రావ‌తి : టీడీపీ వ‌ర్కింగ్ర ప్రెసిడెంట్ నారా లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు త‌న తండ్రి, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు గురించి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మూడు అక్షరాలు చెబితే గౌరవం దక్కుతుంది. ఆ మూడు అక్షరాల బ్రాండ్ సిబిఎన్. ఈ సౌండ్ తాడేపల్లి ప్యాలస్‌కు వినపడాలి.. టీమ్ 11 టీవీలో మహానాడు చూస్తుంది. ఒక్కరితో అయితే పోటీ పడగలం.. కానీ ఆయనలో 25 ఏళ్ళ కుర్రాళ్లు ముగ్గురు ఉన్నారు. ఆయన జెట్ స్పీడ్‌లో వెళ్తుంటారు. ఆయన స్పీడ్ అందుకోవడానికి మనం కష్టపడుతున్నాం. అప్పుడు కియా…ఇప్పుడు ఫైటర్ జెట్స్. అప్పుడు ఐటీ.. ఇప్పుడు ఏఐ. అప్పుడు హైటెక్ సిటీ.. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ. అప్పుడు సైబరాబాద్…ఇప్పుడు అమరావతి.

భవిష్యత్తును ముందుగానే చూసే విజనరీ మా లీడర్ సిబిఎన్. స్త్రీశక్తిని మహా శక్తిగా మార్చింది మన సిబిఎన్. మహిళలకు విద్య, ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు ఇచ్చింది మన సిబిఎన్. డ్వాక్రా ద్వారా మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం ఇచ్చింది మన సిబిఎన్. తన తల్లి పడిన కష్టం మరే తల్లి పడకూడదని దీపం పథకం ప్రవేశ పెట్టింది, మహిళలను బస్ కండక్టర్స్ చేసింది మన సిబిఎన్. దేశంలోనే మొదటి మహిళా స్పీకర్‌గా ప్రతిభా భారతిని నియమించింది మన సిబిఎన్. ఎవరైనా మహిళల జోలికు వస్తే అదే వారికి లాస్ట్ డేట్ అని చెప్పిన దమ్మున్న నాయకుడు మన సిబిఎన్. మహిళల జోలికి వెళితే ఏమవుతుందో చూశారుగా… అర్ధమైందా రాజా అంటూ ఎద్దేవా చేశారు లోకేష్ జ‌గ‌న్ ను ఉద్దేశించి.

Leave A Reply

Your Email Id will not be published!