అమరావతి : ఒకే రాష్ట్రం – ఒకే రాజధాని – అభివృద్ధి వికేంద్రీకరణ మన విధానం. దేశ వ్యాప్తంగా వచ్చే పెట్టుబడుల్లో ఈరోజు 25శాతం ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నాయన్నారు మంత్రి నారా లోకేష్. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్, ఫైటర్ జెట్ ప్రాజెక్టులు ఏపీకి క్యూ కడుతున్నాయి. నేను టీమ్ -11 కెప్టెన్ కి ఒక ఆఫర్ ఇస్తున్నా. సమయం, తేదీ మీరు ఫిక్స్ చేయండి. సంక్షేమం‑అభివృద్ధి పై చర్చకు నేను రెడీ. అభివృద్ధి – సంక్షేమం హడావిడిలో పడి మనం కొన్ని విషయాలు మరచి పోయాం. సైకో హయాంలో బీసీలు, దళితులు, మైనారిటీలపై జరిగిన దాడులను మనం మర్చిపోవద్దు. తన అక్కను ఎందుకు ఏడపించావని అడిగినందుకు బిసి బిడ్ద అమరనాథ్ గౌడ్‌ను పెట్రోల్ పోసి తగల బెట్టారు. ఫేస్ మాస్క్ అడిగిన దళిత డాక్టర్ సుధాకర్ ను వేధించి చంపేశారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపి వైసిపి ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేశారు.
మైనారిటీ సోదరుడు అబ్దుల్ సలాం కుటుంబాన్ని వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారు. వైసిపి నాయకుడు కూతురు కంటే ఎక్కువ మార్కులు వచ్చాయని అని మిస్బా అనే చెల్లిని వేధించి ఆత్మహత్యకు ప్రేరేపించారని ఆవేదన వ్యక్తం చేశారు నారా లోకేష్. గొడ్డలి పార్టీ అంటే సైకోకి కోపం వచ్చింది అంట. మాది గూగుల్ మీది గొడ్డలి. మాది ఫైటర్ జెట్స్ మీది ఫ్యాక్షన్. మాది కియా – మీది కిడ్నాప్. బాబాయిని చంపింది గొడ్డలితో కాదా? తల్లిని ఇంటి నుండి బయటకు గెంటింది నిజం కాదా? చెల్లికి అన్యాయం చేసి ఆస్తులు కొట్టేసింది నిజం కాదా? అందుకే గొడ్డలి పార్టీ అంటున్నాం. తెలుగు దేశం పార్టీ సిద్ధాంతాలలో బలమైన పునాది ఉంది. మారుతున్న కాలానికి తగ్గట్టు విధానాల్లో కూడా మార్పు రావాలి. గత మహానాడులో మనం ఆరు సూత్రాలు ప్రకటించాం. మనం చేసే ప్రతి పనిలో మన ఆరు సూత్రాలు గుర్తుండాలి.
తెలుగు జాతి విశ్వఖ్యాతి / యువగళం / స్త్రీ శక్తి /పేదల సేవలో – సామాజిక న్యాయం / అన్నదాత కు అండగా / కార్యకర్తే అధినేత. నేను పార్టీలో మార్పుల కోసం ఎక్కువ పోరాడతాను. జిల్లా పార్టీ వ్యవస్థ నుంచి పార్లమెంట్ పార్టీ వ్యవస్థకు తీసుకు రావడానికి పెద్ద పోరాటం చేశాను. ముందు ఎవరూ ఒప్పుకోలేదు.. నేను అలిగి ఇంట్లో పడుకోలేదు. అందరిని ఒప్పించి మార్పు చేశాం. టెక్నాలజీ తీసుకొచ్చినప్పుడు అందరూ నన్ను తిట్టుకున్నారు. మీరుచేసే ప్రతి పనిని గుర్తించడానికి మై టిడిపి యాప్ తీసుకు వచ్చాం. గ్రామస్థాయి నాయకుడు పొలిట్ బ్యూరో స్థాయికి రావాలి, అప్పుడే పార్టీ బలంగా ఉంటుంది. గజపతి నగరం మండల పార్టీ ప్రెసిడెంట్ శ్రీదేవి, మంగళగిరి క్లస్టర్ ఇంఛార్జ్ గుత్తికొండ ధనుంజయ్ ఇప్పుడు పొలిట్ బ్యూరో సభ్యులు.