గరుడ వాహనంపై గోకులానందుని దివ్య విహారం

భక్తులపై కటాక్ష వర్షం కురిపించిన శ్రీ వేణు గోపాలస్వామి

తిరుప‌తి : కార్వేటినగరం శ్రీ రుక్మిణి–సత్యభామ సమేత శ్రీ వేణు గోపాలస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని రాత్రి నిర్వహించిన గరుడ వాహన సేవ అత్యంత వైభవోపేతంగా జరిగింది. సర్వాలంకార భూషితుడై గరుడునిపై అధిరోహించిన శ్రీ వేణు గోపాల స్వామివారు గ్రామ వీధుల్లో దివ్య విహారం చేస్తూ భక్తులకు మంగళకర దర్శనమిచ్చారు. స్వామి వారి దివ్య మంగళ స్వరూపాన్ని తిలకించిన భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి భక్తి పారవశ్యంలో మునిగి పోయారు.

పౌరాణిక, ఆధ్యాత్మిక సంప్రదాయాలలో గరుడ వాహన సేవకు అత్యున్నత ప్రాధాన్యం ఉంది. 108 వైష్ణవ దివ్యదేశాలలో గరుడ సేవను మహోత్కృష్టమైన ఉత్సవంగా నిర్వహిస్తారు. భగవంతునికి పరమ భక్తుడైన గరుడునిపై విహరించడం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తి మహిమను లోకానికి చాటి చెబుతారు.జ్ఞానవైరాగ్య స్వరూపమైన రెక్కలతో విహరించే గరుడుని దర్శించిన వారికి పాప విమోచనం కలిగి, ఆధ్యాత్మిక పురోగతి సిద్ధిస్తుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఈ గరుడ వాహన సేవ ద్వారా స్వామివారు భక్తకోటికి జ్ఞాన, భక్తి, వైరాగ్య మార్గాలను బోధిస్తున్నారని పండితులు వివరిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ చెగల్రాయులు, ఆలయ అర్చకులు, అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కార్వేటినగరం శ్రీ రుక్మిణి–సత్యభామ సమేత శ్రీ వేణు గోపాలస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని రాత్రి నిర్వహించిన గరుడ వాహన సేవ అత్యంత వైభవోపేతంగా జరిగింది. సర్వాలంకార భూషితుడై గరుడునిపై అధిరోహించిన శ్రీ వేణు గోపాల స్వామివారు గ్రామ వీధుల్లో దివ్య విహారం చేస్తూ భక్తులకు మంగళకర దర్శనమిచ్చారు.

Leave A Reply

Your Email Id will not be published!