బెంగళూరు ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త

పెరిగిన బోర్డింగ్, అలైటింగ్ పాయింట్లు

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ప్ర‌యాణీకుల‌కు తీపి క‌బురు చెప్పింది. ఈ మేర‌కు అధికారికంగా దూర ప్రయాణీకుల‌కు మేలు చేకూర్చేలా నిర్ణ‌యం తీసుకుంది. బెంగళూరు – హైదరాబాద్ మధ్య ప్రయాణించే ప్రయాణికులకు కబురు అందించింది. ప్రయాణికుల సౌకర్యాన్ని మరింత పెంపొందించేందుకు గాను రెండు నగరాల మధ్య నడిచే అన్ని ఏసీ స్లీపర్, నాన్-ఏసీ బస్సులకు బోర్డింగ్ (బస్ ఎక్కే పాయింట్) , అలైటింగ్ (బస్ దిగే పాయింట్ ) పాయింట్లను భారీగా పెంచినట్లు టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది.

ప్రయాణికులు తమకు నచ్చిన, దగ్గర్లోని ప్రాంతాల నుంచే సులభంగా బస్సులు ఎక్కేందుకు, దిగేందుకు వీలుగా రూట్లను కింది విధంగా క్రమబద్ధీకరించారు. ఇదిలా ఉండ‌గా బెంగళూరులో బోర్డింగ్ , అలైటింగ్ పాయింట్ల వివరాలు ఇలా ఉన్నాయి. పీనియా రూట్ లో (via Peenya): పీనియా (Peenya), యశ్వంతపూర్ మెట్రో స్టేషన్ (Yeshwanthpur Metro Station), కెంపెగౌడ బస్ స్టేషన్ (మెజెస్టిక్), హెబ్బల్ (Hebbal), ఎస్టీమ్ మాల్ (Esteem Mall), ఎలాహంక (Yelahanka), బెంగళూరు ఎయిర్ పోర్ట్ టోల్ ప్లాజా, దేవనహళ్లి బైపాస్ ఉన్నాయి.

చందాపూర్ రూట్ లో (via Chandapura) : చందాపూర్, బొమ్మసంద్ర (Bommasandra), ఎలక్ట్రానిక్ సిటీ (Electronic City), బొమ్మనహళ్లి మెట్రో స్టేషన్, మడివాళ (Madiwala), కెంపెగౌడ బస్ స్టేషన్, హెబ్బల్ ,ఎస్టీమ్ మాల్, ఎలాహంక, బెంగళూరు ఎయిర్ పోర్ట్ టోల్ ప్లాజా, దేవనహళ్లి బైపాస్. ఇక మార్తహళ్లి రూట్ లో (via Marathahalli): వర్తూర్ జంక్షన్ (Varthur Junction), మార్తహళ్లి, దొమ్లూరు బ్రిడ్జి (Domlur Bridge), కెంపెగౌడ బస్ స్టేషన్, హెబ్బల్ , ఎస్టీమ్ మాల్, ఎలాహంక, బెంగళూరు ఎయిర్ పోర్ట్ టోల్ ప్లాజా, దేవనహళ్లి బైపాస్.

Leave A Reply

Your Email Id will not be published!