ఈడీ దాడులతో జగన్ లో భయాందోళనలు : ఎస్. స‌విత

పులివెందుల సహా స్థానిక ఎన్నికల్లో కూటమి క్లీన్ స్వీప్

శ్రీ సత్యసాయి జిల్లా : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసి జగన్, గొడ్డలి పార్టీ నాయకులు దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు మంత్రి ఎస్. స‌విత‌. పక్క రాష్ట్రాల నుంచి గూండాలను తీసుకొచ్చి, టీడీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు చేయ‌డంపై మండిప‌డ్డారు. ఎంపీ మిధున్ రెడ్డి వీధి రౌడీలా వ్యహరించారని ఆరోపించారు. గొడ్డలి పార్టీ నాయకులు ఎన్ని బెదిరింపులకు, దాడులకు పాల్పడినా భయపడేది లేద‌న్నారు. పులివెందుల సహా స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వీప్ చేయబోతున్నాం అని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు ఎస్ స‌విత‌. పోలీసులు పూర్తి స్వేచ్ఛతో విధులు నిర్వర్తిస్తున్నారని స్పష్టం చేశారు. ఒకవైపు ఈడీ దాడులు, మరోవైపు వైఎస్ వివేకా హత్య కేసు వేళ్లన్నీ తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపుతుండడంతో జగన్ లో ఆందోళన మొదలైందన్నారు. త్వరలో వైసీపీ క్లోజ్ అవ్వడం ఖాయమని సవిత తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నామినేషన్ల ప్రారంభమైన మొదటిరోజే గొడ్డలి పార్టీ నాయకులు పెట్రేగి పోయారన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి ఖాయమని తేలి పోవడంతో వైసీపీ నాయకులు విచక్షణ మరిచిపోయి, దాడులకు తెరతీశారని సవిత మండిపడ్డారు. ఎంపీ మిధున్ రెడ్డి వీధి రౌడీలా ప్రవర్తిసూ నామినేషన్ కేంద్రంలో టీడీపీ కార్యకర్తలపై దాడులకు దిగారన్నారు. వైసీపీ దౌర్జన్యాలపై తమ నాయకులు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారన్నారు. దాడులకు తెగబడిన వారిపై చర్యలకు చట్టపరంగా ముందకెళ్తామన్నారు. పోలీసులు పూర్తి స్వేచ్ఛతో విధులు నిర్వర్తిస్తున్నారన్నారని మంత్రి సవిత స్పష్టం చేశారు. గత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో వైసీపీ నాయకులు ఎలా వ్యవహరించారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని మంత్రి సవిత అన్నారు. వారిలా తమ పార్టీ నాయకులు నామినేషన్లు చించలేదని, బెదిరింపులకు, దౌర్జన్యాలకు పాల్పడడం లేదని తెలిపారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగాలన్నది తమ అభిమతమన్నారు. ఒకవైపు ఈడీ వరుస దాడులు, మరోవైపు వైఎస్ వివేకా హత్య కేసులో వేళ్లన్నీ తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయని, ప్యాలెస్ పెద్దలు విల విల లాడుతున్నారని సవిత తెలిపారు. దీంతో ఏం చేయాలో పాలుపోక, జగన్ రెడ్డి రాష్ట్రంలో విధ్వంసాలకు తెర తీశారన్నారు. కూటమి ప్రభుత్వం ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలని చూస్తుంటే. ఆయన మాత్రం శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ పని ముగిసిందని, త్వరలో ఆ పార్టీ క్లోజ్ అవ్వబోతోందని మంత్రి జోష్యం చెప్పారు.

Leave A Reply

Your Email Id will not be published!