#SoftwareDeveloper : కామెడీ లవ్ వెరసీ సాఫ్ట్ వేర్ డెవలపర్ యూట్యూబ్ సిరీస్
Software Developer : కోటి వ్యూవర్లతో యూట్యూబ్ లో దూసుకు పోతోంది ది సాఫ్ట్ వేర్ డెవలప్ షార్ట్ ఫిలిం. సాఫ్ట్ వేర్ కంపెనీలో టీం లీడర్, మేనేజర్, ఇతర ఎంప్లాయిస్ మధ్య ఆసక్తికరమైన సంభాషణలు మనల్ని కట్టి పడేస్తాయి. పూర్తి వినోదాత్మకమైన సిరీస్ లో భాగంగా ఇది మొదటిది. ఇన్ఫినిటమ్ మీడియా ఒక్కటొక్కటిగా షార్ట్ ఫిలింలను రూపొందించి యూట్యూబ్ మాధ్యమంగా విడుదల చేస్తోంది. ఇందులో ప్రధాన పాత్రధారుల్లో షన్ముఖ్ జశ్వంత్ , వైష్ణవి చైతన్య నటించారు. వీరిద్దరికి ఇపుడు సోషల్ మీడియాలో మాంచి పాలోయింగ్ ఉంటోంది. ఏకంగా ఈ లఘు చిత్రాన్ని కోటి 23 లక్షల మందికి పైగా చూశారంటే దీనికి యువతీ యువకులు ఎంతలా కనెక్ట్ అయ్యారో చూస్తేనే అర్థమవుతుంది. సినిమాల్లో నటీ నటుల స్థాయిలో వీరిద్దరి నటన ఉంది. ఇద్దరూ మాట్లాడు కోవడాలు, కసురు కోవడాలు, ఆపై ముద్దుగా చూసు కోవడాలు మనల్ని నవ్విస్తాయి. చూసేలా చూస్తాయి. ఒక్కోసారి మనమూ అలాగే ప్రేమిస్తే ఎలా ఉంటుందోనని అనిపిస్తూ ఉంటుంది.
అంతేనా వైష్ణవి లాంటి చలాకీ ముద్దుగుమ్మ మనతో ఉండి పోతే బావుంటుందని ఓ ఫీల్ పుట్టుకు వస్తుంది. అంతలా కనెక్ట్ అయ్యేలా చేశాడు దర్శకుడు కె. సుబ్బు. ఇది పూర్తిగా వెబ్ సిరీస్ లో భాగంగా మనకు అందుబాటులో ఉంది. పృథ్వీ ముక్కా, జక్కాస్ పృథ్వీ ఇందులో మరో పాత్రధారులు. కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం మనోడిదే. కళాపవన్ సినిమాటోగ్రఫీ అందిస్తే..కళానిధి సౌండ్ ఇంజనీర్‌గా పని చేశాడు. ఈ సిరీస్ లో ఐటీ కంపెనీ మేనేజర్ కు టీం లీడర్ కు మధ్య మాటలు భలే బాగుంటాయి. కాస్తా నేటివిటీకి దగ్గరగా అనిపిస్తుంది. ఈ సాఫ్ట్ వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ ను సాత్విక్ జి. రాయ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే దీనికి ఇంటా బయటా భలే టాక్ వచ్చేసింది. షణ్ముక జశ్వంత్ పేరుకంటే ఈ వెబ్ సిరీస్ లో పెట్టిన నిక్ నేమ్ షన్ను మరింత పాపులర్ అయ్యింది. ఇపుడు హైదరాబాద్ ఐటీలో ఈ నేమ్ మరింత పాపులర్ అయి పోయింది. ఈ ఒక్క సిరీస్ తో మనోడ్ దశ తిరిగింది. వీలైతే మీరూ చూడండి. ఉచితంగా యూట్యూబ్ లో దొరుకుతోంది.
No comment allowed please