Sanjay Manjrekar : కోహ్లీ కంటే ధోనీ బెస్ట్ కెప్టెన్

మంజ్రేక‌ర్ సంచ‌ల‌న కామెంట్స్

Sanjay Manjrekar : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ క్రికెట‌ర్, వివాదాస్ప‌ద కామెంటేట‌ర్ సంజ‌య్ మంజ్రేక‌ర్ మ‌రోసారి సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. ప్ర‌పంచ మంతా విరాట్ కోహ్లీ అద్భుత‌మైన కెప్టెన్ అంటూ ప్ర‌శంస‌లు కురుస్తున్న స‌మ‌యంలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

నాయ‌క‌త్వ ప‌రంగా చూస్తే కోహ్లీ కంటే మ‌హేంద్ర సింగ్ ధోనీ అద్భుత‌మైన స్కిప్ప‌ర్ గా తాను ప‌రిగ‌ణిస్తానంటూ స్ప‌ష్టం చేశాడు సంజ‌య్ మంజ్రేక‌ర్(Sanjay Manjrekar). కోహ్లీని ఆల్ టైమ్ గ్రేట్ కెప్టెన్ల‌తో పోల్చ‌లేమ‌న్నాడు.

భార‌త జ‌ట్టు ప‌రంగా చూస్తే సార‌థ్యం వ‌హించిన వారిలో ధోనీ టాప్ లో ఉంటాడ‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశాడు. ధోనీతో పోలిస్తే కోహ్లీ కెప్టెన్సీ ప్ర‌మాణాలు అంతంత మాత్రాంగ‌నే ఉన్నాయ‌ని కానీ ధోనీ అలా కాద‌ని పేర్కొన్నాడు.

కోహ్లీ కెప్టెన్సీ కెరీర్ లో ఒక్క ఐసీసీ ట్రోఫీ తీసుకు రాలేద‌న్న విష‌యాన్ని గుర్తుంచు కోవాల‌ని పేర్కొన్నాడు. అలా క‌ప్ తెచ్చి ఉంటే కోహ్లీని తాను అద్భుత కెప్టెన్సీ ఎవ‌రు అన్న దానికి సంబంధించి కోహ్లీని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఉండేవాడిన‌ని తెలిపాడు.

ఇదిలా ఉండ‌గా బ్యాట‌ర్ గా మాత్రం విరాట్ అద్భుత‌మైన ఆట‌గాడు అంటూ కితాబు ఇచ్చాడు సంజ‌య్ మంజ్రేక‌ర్(Sanjay Manjrekar). కాగా సంజ‌య్ చేసిన కామెంట్స్ క్రికెట్ రంగంలో క‌ల‌క‌లం రేపాయి.

కెప్టెన్సీ తప్పుకున్నాక వ‌త్తిడి త‌గ్గి అద్భుతంగా రాణించే చాన్స్ ఉంద‌ని అభిప్రాయ ప‌డ్డాడు. త్వ‌ర‌లో ఐపీఎల్ ఇండియాలో స్టార్ట్ కాబోతుంది. ఈ త‌రుణంలో కోహ్లీ ఆర్సీబీ నుంచి భారీగా ప‌రుగులు చేయాల‌ని అభిమానులు కోరుతున్నారు.

Also Read : మేమిద్ద‌రం మంచి స్నేహితులం

Leave A Reply

Your Email Id will not be published!