#Ananya : అనన్య అందం అద్భుతం..నటన మహాద్భుతం

న‌ట‌న‌తో మెప్పిస్తున్న అన‌న్య‌

Ananya : ఎక్కడ ఉన్నదో తెలియదు. కానీ సహజమైన నటనకు ప్రతి రూపంగా నిలిచింది అనన్య. ఐటి ఉద్యోగం చేస్తున్న ఆమెను మల్లేశం సినిమాలో నటించేలా చేశాడు దర్శకుడు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా విడుదలైంది. దేశ వ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకుంది. జాతీయ స్థాయిలో అవార్డు కూడా దక్కించుకుంది. ఈ సినిమా పూర్తిగా తెలంగాణకు చెందిన చేనేత కార్మికుడు చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా రూపొందింది.

పూర్తిగా సామాజిక బాధ్యతతో దీనిని తీశారు దర్శకుడు. ఈ చిత్ర కథ 1980-1990 ల మధ్య కాలం లోనిది. నల్గొండ జిల్లాలోని ఓ కుగ్రామం. ఆ గ్రామస్తుల్లో మల్లేశం కుటుంబం నేత పని చేస్తూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇంకా ఆ గ్రామంలో చాలా మంది ఇదే వృత్తిలో జీవనం సాగిస్తూ అప్పుల్లో కూరుకు పోతారు.

అయితే మల్లేశం చిన్నతనం నుంచి అమ్మ లక్ష్మీ ఆసు పని చేయడంతో చేయి నొప్పి లేస్తుంటుంది. భుజం కూడా పడి పోయే స్థితికి వస్తుంది. ఆ ఊర్లో చాలా మందిది అదే పరిస్థితి. అమ్మ పడే కష్టాలు ఎలాగైనా దూరం చేయాలని చిన్నప్పటి నుంచే ఏదో ఒకటి ప్రయత్నిస్తుంటారు. మల్లేశం పెద్దయ్యాక ఒక్కొక్క ఆలోచనతో ఆసు యంత్రం వైపు అడుగులు వేస్తాడు. ఆ యంత్రాన్ని తయారు చేయడానికి ఊర్లో అప్పులు చేస్తాడు. ఆసు యంత్రం చేస్తున్న మల్లేశంను ఊర్లో అందరూ ఎగతాళి చేస్తారు.

వీడికి పిచ్చి పట్టింది ..వీడు నిజంగా పిచ్చోడు అంటూ ఎగతాళి చేసినా వెనక్కి తగ్గలేదు. మల్లేశంను ఇలాగే వదిలేస్తే.. నిజంగానే పనికి రాకుండా పోతాడని, పెళ్లి చేస్తే బాగు పడతాడని భావిస్తారు. ముందు పెళ్లి వద్దని వారించినా.. తను ప్రేమిస్తున్న మరదలు పద్మ నే తనకు భార్య అవబోతుందని తెలిసి మల్లేశం పెళ్లికి ఒప్పుకుంటాడు.

పెళ్లి అయినా సరే ఆసు యంత్రం తయారు చేసే ప్రయత్నాలను మల్లేశం మానుకోలేదు. అయితే కుటుంబం తో పాటు ఊరులోని వారంతా వద్దన్నా, పట్టువదలని విక్రమార్కుడిలా ముందుకే సాగాడు. ఇదే సమయంలో తన భార్య మాత్రం చేదోడుగా ఉన్నది. ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్న దీని నుంచి కార్మికులకు విముక్తి కలిగించాలని కోరింది. ఇదే క్రమంలో ఓసారి ఆసు యంత్రాన్ని పరీక్షించ బోతే మోటార్‌ పేలి పోతుంది.

ఇక ఆ విషయం తెలిసి అప్పులు ఇచ్చిన వారంతా ఇంటి మీదకు వస్తారు. ఈ విషయంపై మొదటిసారి మల్లేశం అమ్మ కూడా మందలిస్తుంది. అయినా సరే ఆసు యంత్రం చేయాల్సిందేనని, అందుకు డబ్బు కావాలని భార్య పద్మను గాజులు, నగలు ఇవ్వమని అడుగుతాడు. అవి తన పుట్టింటి వారు ఇచ్చినవి, తనకు ఇవొక్కటే మిగిలాయని అంటుంది.

మాటామాటా పెరిగి గొడవ పెద్దదవుతుంది. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మల్లేశం(Ananya).. అప్పుల బాధలు తట్టుకోలేక, తల్లి కూడా మందలించడం, భార్య కూడా సాయం చేయక పోవడంతో ఆత్మహత్య యత్నం చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మల్లేశం అసలు ఆసు యంత్రాన్ని ఎలా తయారు చేశాడు? అనేది మిగతా కథ.

ఈ సినిమా మొత్తం ముగ్గురి మధ్యనే తిరుగుతుంది. ఒకరు మల్లేశం పాత్రను పోషించిన ప్రియదర్శి, మరొకరు భార్యగా నటించిన అనన్య. తల్లిగా ఝాన్సీ గొప్పగా నటించింది. ఆనంద చక్రపాణి, అన్వేష్, జగదీశ్, తిరువీర్ మిగతా పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు మార్క్ కె. రాబిన్ మ్యూజిక్ అందించారు.

రాజ్ వీర్ మల్లేశం సినిమాకు దర్శకత్వం వహించారు. రాజ్ ఆర్ తో పాటు శ్రీ అధికారి దీనిని నిర్మించారు. ఈ మొత్తం సినిమా కమర్షియల్ సినిమాలకు కాదని అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుంది. అచ్చమైన తెలుగుదనం ఉట్టిపడేలా సినిమాలో అనన్య ఆకట్టుకునేలా నటించింది. ఇప్పుడున్న సీనియర్ నటీమణులకు తీసిపోని రీతిలో తన ప్రతిభతో మెప్పించింది.

తెలుగు వారి గుండెలను మీటింది. వృత్తి రీత్యా ఐటి ప్రొఫెషనల్ అయినప్పటికీ మాట తీరులో, నడకలో, నటించడంలో తనను తాను గొప్ప నటిగా ప్రూవ్ చేసుకుంది అనన్య(Ananya). ఇంత కాలం ఇలాంటి నటులు రాలేదనుకుని బాధ పడుతున్న వారికి అనన్య ఓ వరంలా మన ముందుకు వచ్చింది. గలగలా మాట్లాడుతూనే గుండెల్ని మీటుతోంది అనన్య. ప్ర‌స్తుతం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌కీల్ సాబ్ సినిమాలో న‌టిస్తోంది.

No comment allowed please