Sourav Ganguly : వెల్ డ‌న్ బాయ్స్ – సౌర‌వ్ గంగూలీ

రూ. 40 ల‌క్ష‌లు యువ భార‌త్ కు డిక్లేర్

Sourav Ganguly : వెస్టిండీస్ వేదిక‌గా జ‌రిగిన అండ‌ర్ -19 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుచుకున్న యువ భార‌త జ‌ట్టుపై దేశ వ్యాప్తంగా ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.

భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి – బీసీసీఐ చీఫ్ సౌర‌వ్ గంగూలీ(Sourav Ganguly) య‌శ్ ధుల్ నేతృత్వంలోని కుర్రాళ్ల‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు.

ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న భార‌త జ‌ట్టుకు వెల్ డ‌న్ బాయ్స్ అంటూ ట్వీట్ చేశాడు. అంతే కాకుండా విశ్వే విజేత‌గా నిలిచినందుకు గాను అండ‌ర్ -19 జ‌ట్టుకు రూ. 40 ల‌క్ష‌లు న‌గ‌దు బ‌హుమ‌తిగా ప్ర‌క‌టిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

మీరు సాధించిన ఈ గెలుపు యావ‌త్ క్రీడా రంగానికే కాదు భార‌త దేశానికి గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు. కుర్రాళ్లూ..మీరు చూపిన ప‌ట్టుద‌ల‌, ధైర్యం, గెల‌వాల‌న్న క‌సి ఇవాళ అండ‌ర్ -19 విభాగంలో ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ ను గెలిచేలా చేసింద‌ని కొనియాడారు సౌర‌వ్ గంగూలీ(Sourav Ganguly).

జ‌ట్టును ఎంపిక చేసిన బీసీసీఐ జూనియ‌ర్ సెల‌క్ష‌న్ క‌మిటీని కూడా బీసీసీఐ చీఫ్ ప్ర‌త్యేకంగా అభినందించారు. కుర్రాళ్ల‌తో పాటు టీమ్ మేనేజ్ మెంట్, సిబ్బందిని అభినందించారు.

యువ‌త త‌లుచుకుంటే ఏదైనా చేయ‌గ‌ల‌ర‌ని నిరూపించార‌ని పేర్కొన్నారు బీసీసీఐ బాస్ సౌర‌వ్ గంగూలీ. ఇదిలా ఉండ‌గా విండీస్ వేదిక‌గా జ‌రిగిన వ‌ర‌ల్డ్ క‌ప్ లో అండ‌ర్ -19 భార‌త జ‌ట్టు ఇంగ్లండ్ ను 4 వికెట్ల తేడాతో ఓడించి విజేత‌గా నిలిచింది.

మొద‌ట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 189 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. రాజ్ బావా 5 వికెట్లు ప‌డ‌గొడితే ర‌వి కుమార్ 4 వికెట్లు తీశాడు. 190 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన భార‌త జ‌ట్టు 6 వికెట్లు కోల్పోయి 193 ప‌రుగులు చేసింది.

Also Read : ఆసిస్ హెడ్ కోచ్ జ‌స్టిన్ లాంగ‌ర్ గుడ్ బై

Leave A Reply

Your Email Id will not be published!