Lata Mangeshkar : గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం, గాత్ర దిగ్గజం లతా మంగేష్కర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వారిద్దరూ ఈ కాలంలో అవతరించిన దైవ స్వరూపాలే.
స్వర మాధుర్యానికి ప్రతీక ఒకరైతే ఇంకొకరు గాత్రపు చివరి అంచుల్లోకి తీసుకు వెళ్లిన గాయని లతాజీ.
ఇద్దరూ కష్టపడి పైకి వచ్చిన వాళ్లే. ఎవరి సిఫారసులు లేకుండానే తమను తాము ప్రూవ్ చేసుకున్నారు.
తరాలు మారినా టెక్నాలజీ వచ్చినా ఎందరో గాయనీ గాయకులు ఎంట్రీ ఇచ్చినా వారి స్థానాలను భర్తీ చేసే సింగర్స్ ఇంత వరకు రాలేక పోయారు.
ఎస్పీబీ, లతాజీ ఇద్దరూ ఎవరికి వారే సాటి. వీరిద్దరూ కలిసి పాడిన పాటలు దేశాన్ని ఉర్రూతలూగించాయి.
ప్రపంచాన్ని విస్తు పోయేలా చేశారు. ఎన్నో కచేరీలు చేశారు. మరెన్నో చోట్ల తామిద్దరూ కలిసి పాటలతో హృదయాలను కొల్లగొట్టారు.
అంతే కాదు చిరస్మరణీయంగా ఉండేలా అద్భుతమైన పాటలకు ప్రాణం పోశారు.
సంగీత దర్శకులు ఆశించిన దాని కంటే ఇద్దరూ ఇంకా ఎక్కువగా కష్టపడటం నేర్చుకున్నారు.
అందుకనే వారు లెజెండ్స్ ( దిగ్గజాలు) గా పేరొందారు. లోకపు ఎల్లల్ని చెరిపి వేసిన పాటలు ఎన్నో ఉన్నాయి.
బాలచందర్ పుణ్యమా అని ఎస్పీ బాల సుబ్రమణ్యం కమల్ హాసన్ తో తీసిన ఏక్ దూజే కే లియే సినిమాలో పాడించేందుకు లక్ష్మీకాంత్ ప్యారేలాల్ ద్వయం మొదట ఒప్పుకోలేదు.
కానీ బాలచందర్ వింటాడా. తన సినిమాలో హీరో తమిళం మాట్లాడతాడు. అయిష్టంగానే పాడించారు ఎస్పీబీతో.
ఆ విషయం బాలుకు తెలుసు. ఇంకేం సినిమా రిలీజ్ అయ్యింది.
భారతీయ సినీ రంగాన్ని షేక్ చేసింది. ఎక్కడ చూసినా అవే పాటలు. తెలుగులో మరో చరిత్ర.
కానీ హిందీలో ఆ మూవీ సాంగ్స్ దుమ్ము రేపాయి. ఎస్పీబీ ఒక్కసారిగా పాపులర్ హీరో అయి పోయాడు.
ఆనాడు లతా మంగేష్కర్ ( Lata Mangeshkar)తో పాడాలంటే స్థాయి కావాలి. అంతకంటే పాడే నైపుణ్యం కలిగి ఉండాలి.
దీంతో మనోడు స్వంతంగా హిందీ నేర్చుకుని పాడటం స్టార్ట్ చేశాడు.
లతాజీతో ఎందరో పాడినా ఆమెతో ప్రశంసలు మాత్రం పొందిన ఏకైక సింగర్ ఎస్పీబీ కావడం మనందరి అదృష్టం. ఒకరు గాన గంధర్వుడైతే ఇంకొకరు గాన కోకిల.
ఆ తర్వాత వీరిద్దరూ హిందీ సినీ సంగీత చరిత్రలో చిరస్థాయిగా ఉండే పాటలు ఎన్నో పాడారు.
ఆమె పక్కన ఎద్దరో ఉద్దండులు పాడారు. కానీ బాలూ మాత్రం పాడేటప్పుడు తను చాలా జోవియల్ గా ఉండేదని ఓ సందర్భంలో ఎస్పీబీ చెప్పాడు.
ఎప్పుడైతే అభ్యంతరం చెప్పిన లక్ష్మీకాంత్ ప్యారేలాల్ ద్వయం బాలుకు పాటలు ఇవ్వాలని చెబుతూ పోవడం ఆయన స్వరానికి ఉన్న మాధుర్యం అలాంటిది.
సాగర్ లోని ఓ మారియా సాంగ్ హిట్. మైనే ప్యార్ కియా మూవీ బాక్సాఫీసు బద్దలు కొట్టింది. ఇందులో ఎస్పీబీ, లతాజీ పాడిన పాటలు ఎవర్ గ్రీన్ గా నిలిచాయి.
దిల్ దివానా పాట్ ఊపేసింది. ఆ తర్వాత వీరిద్దరూ పాడిన హమ్ ఆప్ కే హై కౌన్ సూపర్ హిట్ .
దీదీ తేరా దేవర్ దివానా సాంగ్ దేశాన్ని ఊపేసింది. తెలుగులో, తమిళంలో కలిసి పాడారు.
బాలు చని పోయినప్పుడు తీవ్రంగా కంట తడి పెట్టుకున్నారు లతా మంగేష్కర్( Lata Mangeshkar). చాలా కాలం కిందట ఇంటికి వచ్చాడు.
బాలూను దగ్గరికి తీసుకున్నా. ముఖేష్, రఫీ, కిషోర్ కుమార్,
మన్నాడేతో పాటు ఎస్పీబీ కూడా ఒకరు నేను ప్రేమించే వాళ్లలో అని తన అభిమానాన్ని చాటుకుంది లతాజీ.
బాలు పాడినప్పుడు ప్రపంచం నిశ్చలంగా నిలబడి వినడం చూశానని చెప్పింది.
ఇప్పుడు ఇద్దరూ తమ గాత్రాన్ని ఆ దేవలోకంలో వినిపించేందుకు వెళ్లి పోయారు.