Lata 92 Music Directors : 92 ఏళ్లు 92 సంగీత ద‌ర్శ‌కులు

గాన కోకిల‌తో మ్యూజిక్ డైరెక్ట‌ర్లు

Lata 92 Music Directors  : భార‌త దేశం గ‌ర్వించ‌ద‌గిన గాయ‌నిగా పేరొందిన ల‌తా మంగేష్క‌ర్ పాడ‌లేనంటూ క‌న్ను మూశారు. 92 ఏళ్ల వ‌య‌సులో 13 ఏళ్ల స‌మ‌యంలో త‌న కెరీర్ ప్రారంభించింది.

ఆనాటి నుంచి నేటి దాకా వివిధ త‌రాల‌కు చెందిన సంగీత ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేసింది.

ఎప్ప‌టికీ చెరిగి పోని పాట‌ల‌ను పాడింది. 50 వేల‌కు పైగా పాట‌లు పాడింది. ఎన్నో ఎన్న‌ద‌గిన పాట‌లు పాడింది.

ఆమె 92వ పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని 92 మందితో పాడిన పాట‌ల‌తో కూడిన ఓ వీడియో కూడా రూపొందించారు.

మొద‌టి సాంగ్ మ‌హ‌ల్ కు పాడింది. ఖేమ చంద్ర ప్ర‌కాశ్ మ్యూజిక్ అందించాడు.

ఆయేగా ఆనేవాలా అంటూ ఆలాపించింది ల‌తా. అనిల్ బిస్వాస్ అందించిన త‌రానాలో బీమాన్ తోరే నైన్వా,

స‌జ్జాద్ హుస్సేన్ మ్యూజిక్ అందించిన సాంగ్లిల్ వో తో చ‌లే గ‌యే దిల్ అని పాడింది.

నౌషాద్ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బైజు బావ్రాలో మోహే భూల్ గ‌యే స‌న్వారియా అని ప్రాణం పోసింది.

శ్యాంసుంద‌ర్ అందించిన బ‌జార్ లో స‌జ‌న్ కి గ‌లియా చోడ్ చ‌లే, శంక‌ర్ జైకిస‌న్ దిల్ అప్నా ఔర్ ప్రీత్ ప‌రాయి లో అజీబ్ ద‌స్తాన్ హై అని పాడింది.

సి. రామ‌చంద్ర మ్యూజిక్ అందించిన అనార్కిలిలో యే జింద‌గీ ఉసికీ హై అని అల‌రించింది ల‌తాజీ.

హుస్న్ లాల్ భ‌గ‌త్ర‌మ్ చేసిన బ‌డి బెహ‌న్ లో చ‌లే జానా న‌హీన్ , ఎస్డీ బ‌ర్మ‌న్ మ్యూజిక్ ఇచ్చిన గైడ్ లో పియా తోసే నైనా ల‌గే రీ అన్న సాంగ్ దుమ్ము రేపింది.

వ‌సంత్ దేశాయ్ చేసిన ఝ‌నక్ ఝ‌న‌క్ పాయ‌ల్ భ‌జే లో సైయ‌న్ జావో అని పాడింది ల‌త‌.

గులాం హైద‌ర్ సంగీతం అందించిన మ‌జ్బూర్ లో దిల్ మేరా తోడా,

 ఎన్ ద‌త్తా చేసిన సాధ‌న లో ఔర‌త్ నే జ‌న‌మ్ దియా, అమ‌ర్ నాథ్ మ్యూజిక్ ఇచ్చిన గ‌రం కోట్ లో న‌న్హా మోరా డోలే తో ఆక‌ట్టుకుంది.

హేమంత్ కుమార్ మ్యూజిక్ చేసిన బీస్ సాల్ బాద్ లో క‌హిన్ దీప్ జ‌లే క‌హిన్ దిల్ , 

ఎంఎస్ విశ్వ‌నాథ‌న్ , టీకేఆర్ అందించిన న‌యా ఆద్మీలో పంచ్ నిమిషాల ఔర్ పాడింది.

వినోద్ చేసిన ఏక్ థీ లడ్కీ మూవీలో లారా ల‌ప్పా, భోలా శ్రేష్ట చేసిన యే బ‌స్తీ యే లోగ్ మూవీలో దిల్ జ‌లేగా తో అని పాడింది. 

ద‌త్తా దాన్హేక‌ర్ సంగీతం అందించిన ఆప్ కీ సేవా మెయిన్ లో పా ల‌గూన్ క‌ర్ జోరీ రే అని ఆలాపించింది.

మోహింద‌ర్ చేసిన షిరిన్ ఫ‌ర్హాద్ మూవీలో గుజ్రా హుమా జ‌మానా , త్రిపాఠి చేసిన రాణి రూప‌మితి లో ఆ లౌట్ కే ఆజా మేరే మీట్ అని పాడింది ల‌తాజీ.

బుల్ సి రాణి చేసిన మ‌ధుర్ మిల‌న్ లో దిల్ ప్యార్ కీ మెహ‌ఫ‌ల్ హై , హ‌న్స్ రాజ్ బెహ్ల్ చేసిన రాజ‌ధాని డిడి మోరా కంగ‌నా ,

 జ‌మాల్ సేన్ షోకియాన్ లో స‌ప్నా బాన్ స‌జ‌న్ , ఆర్ సీ బోర‌ల్ ద‌ర్ద్ ఇ దిల్ లో నా తో దిన్ అని పాడారు ల‌తా.

ఆది నారాయ‌ణ‌రావు ఫూలోన్ కీ సేజ్ లో ఆ భి జా ర‌సియా , మ‌న్నాడే చేసిన నైనా లో మెయిన్ దేఖూన్ తో హే దిన్ రాతి ,

 ముకేష్ అనురాగ్ నాజ‌ర్ మిలాకే, ఎస్డీ బాతీష్ చేసిన బేతాబ్ అభి కుచ్ రాత్ బాకీ హై అంటూ పాడారు.

న‌షాద్ చేసిన బ‌రాదారి లో అబ్ కే బ‌ర‌స్ , మ‌ద‌న్ మోహ‌న్ చేసిన హూ కౌన్ తీ లాగ్ జ‌గ‌లే, రోష‌న్ మ‌మ‌త లో ర‌హెన్ నా ర‌హెన్ హ‌మ్ అని పాడింది.

స‌లీల్ చౌద‌రి ప‌రాఖ్ లో ఓహ్ స‌జ్నా, చిత్ర గుప్త్ ఆకాష్ దీప్ లో దిల్ కా దియా,

 దిలీప్ ధోలాకియా చేసిన ప్రైవేట్ సెక్ర‌ట‌రీ లో జ జ‌రే చందా అని పాడారు ల‌తా.

ఇక్బాల్ ఖురేష్ చేసిన బ‌నారసి థ‌గ్ లో యాద్ సుహానీ తేరీ , 

జై దేవ్ చేసిన హ‌మ్ దోనోలో అల్లా తేరే నామ్ , ప్రేమ్ ధ‌వాన్ చేసిన ష‌హీద్ లో జోగి హ‌మ్ తో లుట్ గ‌యే పాడారు.

రాం లాల్ చేసిన సేహ్రా లో పంఖ్ హూతే తో ఉద్ ఆతి రే, ర‌వి శంక‌ర్ చేసిన అనుప‌మ‌లో కైసే దిన్ బీటే

, ర‌వి చేసిన ఖండ‌న్ లో తుమ్హీ మేరే మందిర్ అంటూ పాడింది.

శేలేష్ ముఖ‌ర్జీ చేసిన న‌వేరా లో న‌దియా కే పానీ, సుధీర్ ఫ‌డ్కే చేసిన భాభికి చూడియ‌న్ లో జ్యోతి క‌లాష్ చ‌ల్కే, 

వ‌సంత ప్ర‌భు చేసిన మ్యూజిక్ లో మైం న‌హీం మ‌ఖ‌న్ ఖాయో అని అద్భుతంగా పాడింది. 

వేద్పాల్ వ‌ర్మ మ్యూజిక్ అందించిన భూత్నాథ్ లో తుమ్ నా ఆయే స‌న‌మ్, ల‌క్ష్మికాంత్ ప్యారేలాల్ చ‌సిన ఆయే దిన్ బ‌హార్ కే లో సునో స‌జ్నా ,

ఆర్డీ బ‌ర్మ‌న్ చేసిన అనామికాలో బ‌హోన్ మైన్ చ‌లే ఆవో అని పాడింది ల‌తాజీ.

క‌ళ్యాణ్ జీ ఆనంద్ జీ చేసిన ముక్క‌ద‌ర్ కా సికింద‌ర్ లో దిల్ తో హై దిల్ పాట పాడింది.

బసు మ‌నోహ‌రి చేసిన బిన్ బాప్ కా బేటా లో తా నా నారే తానా ద‌మ్ , ఘ‌న్ శ్యామ్ చేసిన కున్వార బ‌ద‌న్ లో అప్ని ఖుషీ సే,

గులామ్ మొహ‌మ్మ‌ద్ చేసిన పాకీజాలో ఇన్హి లోగోన్ నే అని పాడింది.

సోనిక్ ఓమి సంగీతం అందించిన దిల్ నే ఫిర్ యాద్ కియా లో ఆజ్ రే ప్యార్ పుకారే అని పాడింది ల‌త‌.

కిషోర్ కుమార్ చేసిన జమీన్ ఆస్మాన్ లో నా రో ఏ మేరే దిల్ , హేమంత్ భోంస్లే చేసిన బంధ‌న్ కుచ్ఛ‌స్త్ర ధాగోన్ కా లో యే బంధ‌న్ హై,

కె మ‌హావీర్ ఆజ్ కీ రాత్ , మీనా ఖాదిక‌ర్ మ్యూజిక్ చేసిన కానూన్ కా షికార్ చేసిన జానే క‌హాన్ దేకే ద‌గా అని పాడింది ల‌తా.

స‌ప‌న్ చ‌క్ర‌వ‌ర్తి చేసిన న‌యా న‌షా లో ఏ ఆవో క‌రెన్ బాతేన్ , శ్యామ్ జీ ఘ‌న్ శ్యామ్ జీ నియాజ్ ఔర్ న‌మాజ్ లో జ‌లీమ్ తేరీ త‌ఖ‌త్ కా న‌షాలో పాడింది ల‌త‌.

స‌బ‌న్ జ‌గ్ మోహ‌న్ చేసిన కాల్ గ‌ర్ల్ లో ఉల్ఫ‌త్ మెయిన్ జ‌మాన్ కి,

శ్యామల్ మిత్ర చేసిన మ‌మ‌త‌లో హ‌మ్ ఘ‌మ్ సే నా హారేంగే, ఖ‌య్యామ్ చేసిన ర‌జియా సుల్తాన్ లో ఏ దిల్ ఇ నాద‌న్ అని పాడింది ల‌తా.

రాజేష్ రోష‌న్ మ్యూజిక్ అందించిన దిల్ తుజ్కో దియా లో వాడా నా తోడ్ ,

ఉషా ఖ‌న్నా అందించిన సౌతాన్ లో జింద‌గీ ప్యార్ కా గీతా హై , బ‌ప్పీల‌హ‌రి చేసిన జ్యోతిలో తోడా రేష‌మ్ లగ్తా హై అని పాడింది.

ర‌వీంద్ర జైన్ చేసిన సౌదాగ‌ర్ లో తేరా మేరా సాథ్ ర‌హే, శివ హ‌రి చేసిన సిల్సిలా లో నీల ఆస్మాన్ సో గ‌యా అని ఆలాపించింది ల‌తాజీ.

జుగ‌ల్ కిషోర్ తిల‌క్ రాజ్ చేసిన భీగీ పాల్కేన్ లో జ‌న‌మ్ జ‌న‌మ్ కా సాథ్ హై , విజ‌య్ సింగ్ చేసిన క‌భీ అజ్జాత వాసి లో దిల్ కి ఇస్ దేహ్లీజ్ త‌క్ అని పాడింది.

వ‌న‌రాజ్ భాటియా సంగీతం అందించిన త‌రంగ్ మూవీలో బార్సే ఘ‌న్ సారీ రాత్ ,

అమ‌ర్ ఉత్ప‌ల్ చేసిన షెహెన్షా లో జేన్ దో జానే దో, మ‌హేష్ కిషోర్ చేసిన స‌న‌మ్ బేవాఫా లో చుడీ మ‌జా నా డేగి అని పాడింది.

శ్రీ‌నివాస్ ఖ‌లే అందించిన రామ్ భ‌జ‌న్ క‌ర్ మాన్ , రామ్ ల‌క్ష్మ‌ణ్ అందించిన మైనే ప్యార్ కియాలో దిల్ దీవానా

, హృద‌య‌నాథ్ మంగేష్క‌ర్ చేసిన లేకిన్ లో యారా సీలీ సిలి అని త‌న గాత్రంతో ఆక‌ట్టుకుంది ల‌తాజీ.

అనూ మాలిక్ అందించిన గంగా జ‌మున స‌ర‌స్వ‌తి లో స‌జ‌న్ మేరా ఉస్ పార్ హై అని పాడింది.

భూపేన్ హ‌జారికా మ్యూజిక్ అందించిన రుడాలి లో దిల్ హూమ్ హుమ్ క‌రే అని పాడింది ల‌తా.

జ‌గ్జీత్ సింగ్ చేసిన స‌జ్జా మూవీలో ధువాన్ బానాకే ఫిజా మెయిన్ , విశాల్ భ‌ర‌ద్వాజ్ మ్యూజిక్ చేసిన మ‌చిస్ లో పానీ పానీ రీ పాడారు ల‌తాజీ.

నుస్ర‌త్ ఫ‌తే అలీ ఖాన్ సంగీతం అందించిన క‌చ్చే దాగేలో తేరే బిన్ న‌హిన్ జీనా , బబ్లా చేసిన హీరో హెరాలాల్ లో స‌న్నోన్ కీ దునియా హై పాడింది.

శ్యామ్ సురేంద‌ర్ సంగీతం అందించిన విశ్వాస్ ఘాత్ లో ఇంతేజార్ హై , ఆనంద్ మిలింద్ చేసిన వంశ్ లో యే బిందియా యే క‌జ్రా పాడింది ల‌తాజీ.

జ‌తిన్ లలిత్ మ్యూజిక్ అందించిన దిల్ వాలే దుల్హ‌నియా లేజాయేంగే లో మేరే ఖ్వాబోన్ మెయిన్ జో ఆయే,

దిలీప్ సేన్ స‌మీర్ సేన్ చేసిన ఐనా లో యే రాత్ ఖుష్నా సీబ్ హై పాడారు ల‌తాజీ.

ఉత్త‌మ్ సింగ్ మ్యూజిక్ చేసిన దిల్ తో పాగ‌ల్ హై లో అరేరే అరే యే క్యా హూవా,

న‌దీమ్ శ్ర‌వ‌ణ్ చేసిన బేవ‌ఫాలో కైసే పియా సే మైం క‌హూవ్ , ఇళ‌య‌రాజా చేసిన ల‌జ్జాలో కొన్ డాగ‌ర్ అని పాడింది.

ఎ. ఆర్. రెహ‌మాన్ చేసిన ల‌గ‌న్ లో ఓ ప‌ల‌న్హ‌రే, ఆదేశ్ శ్రీ‌వాస్త‌వ చేసిన దిల్ క‌హిన్ హూష్ క‌హిన్ లో తుమ్సే మిల్క‌ర్ పాడింది ల‌తాజీ.

ఆద్నాన్ స‌మీ సంగీతం అందించిన ల‌క్కీలో షాయ‌ద్ యాహీ తో ప్యార్ హై,

రాహుల్ శ‌ర్మ చేసిన ముజ్సే దోస్తీ క‌రోగే లో జానే దిల్ మెయిన్ క‌బ్ సే హై తు అని పాడింది.

ష‌మీర టాడోన్ చేసిన పేజీ 3లో కిత్నే అజీబ్ రిష్టే హై య‌హా పే, మ‌యూరేష్ పై చేసిన సాద్గీ లో ముఝే ఖ‌బ‌ర్ థీ అని పాడింది ల‌తాజీ.

Also Read : స్వ‌ర మాధుర్యం గాత్రం అజ‌రామ‌రం

Leave A Reply

Your Email Id will not be published!