#GonguraPachadi : ఆంధ్ర మాత గోంగూర పచ్చడి రుచి చూద్దామా..
తెలుగువారికి అత్యంత ప్రీతి కరమైన పచ్చళ్లలో గోంగూర పచ్చడి ఒకటి.
Gongura Pachadi : తెలుగువారికి అత్యంత ప్రీతి కరమైన పచ్చళ్లలో గోంగూర పచ్చడి ఒకటి. ఆంధ్ర మాతగా పిలవబడే గోంగూర పచ్చడి అంటే ఇష్టం లేనివారు ఉండరు. అందుకే మనం ఈ రోజు గోంగూర పచ్చడి ఆంధ్ర స్టైల్ లో ఎలాగ తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.. ఇప్పుడు దానికి కావలసిన పదార్ధాలు, తయారు చేయు విధానం తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు :
గోంగూర – 5 కట్టలు
ఉల్లిపాయ ముక్కలు – ఒక కప్పు
ఎండు మిరపకాయలు – 8 నుండి 10
ధనియాలు – రెండు టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి – 7 రెబ్బలు
చింతపండు – కొద్దిగా
ఉప్పు – తగినంత
పోపుదినుసులు – 1 టేబుల్ స్పూన్
ఇంగువ – చిటికెడు
కరివేపాకు – 2 రెమ్మలు
నూనె – సరిపడ
తయారుచేయు విధానం :
ముందుగా గోంగూరను కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌ మీద మందపాటి గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి ధనియాలు, ఎండు మిరపకాయ ముక్కలు వేసి వేయించి తరువాత గోంగూర కూడ వేసి బాగా మగ్గనివ్వాలి. వేడి చల్లారిన తర్వాత మిక్సీలో ముందు ఎండుమిరపకాయల మిశ్రమం వేసి మెత్తగా పొడి చేసిన తర్వాత గోంగూర ముద్ద వేసి తగినంత ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు కలుపుకోవాలి. తర్వాత అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక పోపుదినుసులు, మిరపకాయ, కొద్దిగా ఇంగువ వేసి వేగాక కరివేపాకు వేసి చివరగా గోంగూరను కూడా వేసి ఒకసారి కలిపి ఒక బౌల్ లోకి తీసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే నోరూరించే గోంగూర పచ్చడి రెడీ అయినట్లే.

No comment allowed please