ICC T20 ODI Rankings : టీ20, వ‌న్డే ర్యాంకింగ్స్ లో ఆజ‌మ్ టాప్

4వ ర్యాంకులో రాహుల్ 10వ ర్యాంకులో కోహ్లీ

ICC T20 ODI Rankings : ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ – ఐసీసీ టీ20 ఫార్మాట్ కు సంబంధించి ర్యాంకింగ్స్ డిక్లేర్ చేసింది. ఈ మేర‌కు త‌న అధికారిక ట్విట్ట‌ర్ లో వెల్ల‌డించింది. మ‌రోసారి పాకిస్తాన్ స్టార్ ప్లేయ‌ర్ , స్కిప్ప‌ర్ బాబ‌ర్ ఆజ‌మ్ ఐసీసీ ర్యాంకింగ్స్ (ICC T20 ODI Rankings)లో టాప్ లో నిలిచాడు.

భార‌త ఓపెన‌ర్ , వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ 4వ ర్యాంకులో కొన‌సాగుతుండ‌గా 10వ స్థానంతో స‌రి పెట్టుకున్నాడు క్రికెట్ దిగ్గ‌జం విరాట్ కోహ్లీ. ఇక ఆల్ రౌండ‌ర్ల జాబితాలో టాప్ 10 లో ఏ ఒక్క ఇండియ‌న్ క్రికెట‌ర్ లేక పోవ‌డం విశేషం.

అయితే ఆస్ట్రేలియా సీమ‌ర్ జోష్ హేజిల్ వుడ్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో బౌలింగ్ ర్యాంకింగ్స్ లో రెండో స్థానానికి ఎగ‌బాకాడు. ఇదే ఫార్మాట్ లో ద‌క్షిణాఫ్రికాకు చెందిన త‌బ్రేజ్ ష‌మ్సీ టాప్ లో నిలిచాడు.

ఇక వ‌న్డే ర్యాంక్సింగ్స్ ప‌రంగా చూస్తే బ్యాటింగ్ లో కోహ్లీ, రోహిత్ శ‌ర్మ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. పాకిస్తాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్ వ‌రుస‌గా ఫ‌స్ట్ లో నిలిచాడు. శ్రేయ‌స్ అయ్య‌ర్ , సూర్య కుమార్ యాద‌వ్ త‌మ ర్యాంకింగ్స్ ను మెరుగు ప‌రుచుకున్నారు.

విండీస్ తో జ‌రిగిన రెండో వ‌న్డేలో సూర్య 64 ప‌రుగులు చేశాడు. మూడో వ‌న్డే లో 80 ర‌న్స్ చేశాడు. భార‌త్ 3-0తో విజ‌యం సాధించి సీరీస్ చేజిక్కించుకుంది. పంత్ హాఫ్ సెంచ‌రీ సాధించి 71వ స్థానానికి చేరుకున్నాడు.

టీ20 బౌలింగ్ జాబితా చూస్తే జ‌స్పీత్ బుమ్రా 7వ స్థానంలో ఉన్నాడు. వ‌న్డే బౌలింగ్ లో కీవీస్ కు చెందిన బౌల్ట్ టాప్ లో ఉన్నాడు. ఆల్ రౌండ‌ర్ల జాబితాలో ష‌కీబ్ అల్ హ‌స‌న్ అగ్ర స్థానంలో కొన‌సాగుతున్నాడు.

Also Read : ‘హ‌స‌న్’ మ‌గాడు కానీ ప‌క్క‌న పెట్టారు

Leave A Reply

Your Email Id will not be published!