Rakesh Jhun Jhun Wala : భారతీయ ప్రముఖ స్టాక్ మార్కెట్ కింగ్ మేకర్ , బిగ్ బుల్ జున్ జున్ వాలా సంచలన కామెంట్స్ చేశారు. వాతారణాన్ని, చావును, మహిళలను, మార్కెట్ ను ఎవరూ అంచన వేయలేరని స్పష్టం చేశారు.
సీఐఐ మీటింగ్ లో పాల్గొన్న బిగ్ బుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మార్కెట్ లో కింగ్ లు ఎవరూ లేరని తాము రాజులమని అనుకున్న వాళ్లంతా జైళ్లల్లో ఉన్నారని అన్నారు.
ప్రస్తుతం ప్రపంచంలో మార్కెటే కింగ్ మేకర్ అని పేర్కొన్నారు. భారత దేశం టైం ఇప్పుడు వచ్చిందన్నారు. రియల్ ఎస్టేట్ గురించి తన ఎయిర్ లైన్ కంపెనీ గురించి జున్ జున్ వాలా (Rakesh Jhun Jhun Wala)సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ప్రస్తుతం ఐటీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా కొనసాగుతోందన్నారు. రాబోయే ఐదేళ్లలో ఈ వాటా 75 శాతానికి పెరుగుతుందని చెప్పారు. సాఫ్ట్ వేర్ తో పాటు ఫార్మా రీసెర్చ్ తదితర రంగాలు విస్తరిస్తాయని చెప్పారు.
ఐటీ సెక్టార్ ఒక్క రంగమే 30 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తుందన్నారు. విచిత్రం ఏమిటంటే రహి రహేజాను సూటింగ్ ప్రశ్నించారు. తన నిర్మాణ కంపెనీని ఎందుకు లిస్టింగ్ చేయలేదని ప్రశ్నించాడు.
నిలబెట్టు కోలేని హామీలను ఇవ్వవద్దన్నారు. అయితే ఇంకో ఆసక్తికరమైన వ్యాఖ్య చేశాడు. నాలుగు ఐదు ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టానని ఇంకా డబ్బులు రాలేదన్నారు జున్ జున్ వాలా.
క్రిసిల్ షేర్లను అమ్మేస్తే రూ. 27 కోట్లు వచ్చినవి. దాని విలువ రూ. 45 కోట్లకు పెరిగింది. ఆ షేర్లను హోల్డ్ చేసి ఉంటే వాటి వాల్యూ రూ. 1,000 కోట్లు ఉండేదన్నారు.
Also Read : జియోకు ఎయిర్ టెల్ ఝలక్