Zaira Wasim : హిజాబ్ వివాదం జైరా వాసిమ్ ఆగ్ర‌హం

ఈ వ్య‌వ‌స్థ ప‌ట్ల బాధ ఉంద‌న్న న‌టి

Zaira Wasim : క‌ర్ణాట‌క‌లో చోటు చేసుకున్న హిజాబ్ వివాదం ఇంకా కొన‌సాగుతూనే ఉన్న‌ది. ఈ వివాదం ప్ర‌స్తుతం కోర్టులో విచార‌ణ జ‌రుగుతోంది. దేశ వ్యాప్తంగా రాద్దాంతం చోటు చేసుకుంది. స‌రిహ‌ద్దులు దాటి ప్ర‌పంచ వ్యాప్తంగా దీనిపై చ‌ర్చ కొన‌సాగుతోంది.

తాజాగా హిజాబ్ వివాదంపై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు బాలీవుడ్ కు చెందిన న‌టి జైరా వాసిమ్(Zaira Wasim). ఆమె అమీర్ ఖాన్ న‌టించిన దంగ‌ల్ మూవీలో న‌టించింది. తాను కూడా హిజాబ్ ధ‌రించిన మ‌హిళ‌గా ఈ మొత్తం వ్య‌వ‌స్థ‌పై ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది.

ఈ మేర‌కు జైరా వాసిమ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసింది. క‌ర్ణాట‌క‌లోని పాఠ‌శాల‌లో హిజాబ్ పై నిషేధం విధించ‌డం అన్యాయ‌మ‌ని ఆవేద‌న వ్య‌కం చేసింది జైరా వాసిమ్.

గ‌త నెల 1న ఉడిపి లోని ప్ర‌భుత్వ పీయూ కాలేజీలో ఆరుగురు మ‌హిళా ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధ‌రించ‌డంపై ఉక్కు పాదం మోపింది యాజ‌మాన్యం. కాలేజీకి అనుమ‌తించ లేద‌ని స్పష్టం చేసింది.

58 మంది విద్యార్థులపై వేటు వేయ‌డం మ‌రింత ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. ఈ సంద‌ర్భంగా జైరా వాసిమ్(Zaira Wasim) తీవ్ర ఆవేద‌న ప‌డ్డారు.

తాను హిజాబ్ ధ‌రించిన మ‌హిళ‌గా కృత‌జ్ఞ‌త‌తో , విన‌యంతో మహిళ‌లు ఆపి వేస్తున్న‌, వేధింపుల‌కు గుర‌వుతున్న ఈ మొత్తం వ్య‌వ‌స్థ‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.

ఇదిలా ఉండ‌గా హిజాబ్ వివాదంపై ప్ర‌ముఖ గీత ర‌చ‌యిత జావేద్ అక్త‌ర్, న‌టి సోన‌మ్ క‌పూర‌ర్ తో పాటు ప్ర‌ముఖులు స్పందించారు.

Also Read : ఇద్దరు సీఎంల భేటీలో ప్ర‌కాశ్ రాజ్

Leave A Reply

Your Email Id will not be published!