Sanjay Raut : తెలంగాణ సీఎం కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut). కేసీఆర్, ఉద్దవ్ ఠాక్రేల మధ్య భేటీ అనంతరం ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు.
దేశంలో ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేసే నైపుణ్యం, నాయకత్వం, సత్తా కేసీఆర్ కు ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం సంజయ్ రౌత్ (Sanjay Raut) చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
ఇదిలా ఉండగా కసీఆర్ ఉద్దవ్ తో పాటు శరద్ పవార్ తో భేటీ అయ్యారు. ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు సీఎం ఉద్దవ్ ను హైదరాబాద్ కు రావాల్సిందిగా ఆహ్వానించారు.
కాంగ్రెస్ రహిత కూటమి ప్రస్తావన వచ్చిందన్న దానిపై సంజయ్ రౌత్ క్లారిటీ ఇచ్చారు. అలాంటి చర్చలేవీ జరగలేదని కుండ బద్దలు కొట్టారు. కాంగ్రెసేతర రాజకీయ ఫ్రంట్ గురించి తాము ఎప్పుడూ చర్చించ లేదన్న సంగతి గుర్తించాలన్నారు.
గతంలో టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ లేకుండా కూటమి సాధ్యం కాదని చెప్పామన్నారు సంజయ్ రౌత్.
నాగపూర్ లో సంజయ్ రౌత్ మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం యూపీలో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ఖాయమన్నారు.
మార్పు అన్నది ప్రస్తుతం అత్యవసరం అని తాము అభిప్రాయ పడుతున్నామన్నారు. కేసీఆర్ చాలా కష్టపడి పని చేసే నాయకుడు. తన రాజకీయ జీవితంలో ఎన్నో పోరాటాలు చేశారు. అందరినీ ఏక తాటిపై నడిపించే సత్తా ఉన్నోడన్నాడు.
Also Read : మోదీపై అఖిలేష్ యాదవ్ ఫైర్