Smriti Mandhana : స్ట‌న్నింగ్ క్యాచ్ తో మెరిసిన మంధాన‌

రీ ఎంట్రీతో దుమ్ము రేపిన క్రికెట‌ర్

Smriti Mandhana  : భార‌త మ‌హిళా క్రికెట‌ర్ల‌లో మోస్ట్ పాపుల‌ర్ ఎవ‌రైనా ఉన్నారంటే మిథాలీ రాజ్ త‌ర్వాత స్మృతి మంధాన‌(Smriti Mandhana). అటు బ్యాట‌ర్ గానే కాదు అద్భుత‌మైన ఫీల్డ‌ర్ కూడా. ఒక్క‌సారి బంతి వ‌చ్చిందంటే చాలు ప‌రుగు వ‌చ్చే ఛాన్స్ అంటూ ఉండ‌దు.

ఇప్ప‌టికే ప‌లు మ్యాచ్ ల‌లో అద్భుత‌మైన క్యాచ్ ల‌తో ఆక‌ట్టుకుంది మంధాన‌. తాజాగా న్యూజిలాండ్ తో జ‌రిగిన వ‌న్డే మ్యాచ్ లో క‌ళ్లు చెదిరేలా బంతిని ప‌ట్టుకుని విస్తు పోయేలా చేసింది.

వ్య‌క్తిగ‌త కార‌ణాల రీత్యా మూడు వ‌న్డేల‌కు దూర‌మైన స్మృతీ నాలుగో వ‌న్డేలో ఆడింది. వ‌స్తూనే దుమ్ము రేపే క్యాచ్ ను ప‌ట్టుకుంది. ఇక కీవీస్ ఇన్నింగ్స్ లో ఆరో ఓవ‌ర్ వేసిన రేణుకా సింగ్ బౌలింగ్ లో సోఫియా డివైన్ పాయింట్ దిశ‌గా ర‌న్ చేసేందుకు య‌త్నించింది.

కాగా పాయింట్ లో ఫీల్డింగ్ చేస్తున్న స్మృతీ మంధాన డైవ్ చేస్తూ క‌ళ్లు చెదిరేలా క్యాచ్ ప‌ట్టింది. దీంతో డివైన్ విస్తు పోయింది. ఒక‌వేళ మంధాన గ‌నుక వ‌దిలేసి ఉంటే ఫోర్ పోయేది.

ప్ర‌స్తుతం మంధాన తీసుకున్న ఆ క్యాచ్ కు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైర‌ల్ గా మారింది. ఎక్క‌డ చూసినా స్మృతి వీడియో ప్లే అవుతోంది.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే భార‌త మ‌హిళా జ‌ట్టు ఓడి పోయింది. కానీ రెండు ఆస‌క్తిక‌ర స‌న్నివేశాల‌కు వేదికగా మారింది. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచ‌రీ సాధించింది భార‌తీయ బ్యాట‌ర్ రిచా.

ఇక స్ట‌న్నింగ్ క్యాచ్ తో స్మృతి మంధాన ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. బ్యాటింగ్ ప‌రంగా కూడా మంధాన అన్ని వైపులా క‌ళ్లు చెదిరే షాట్స్ ఆడ‌డంలో ఎక్స్ ప‌ర్ట్.

Also Read : ఐపీఎల్ వేలం ప‌ద్ద‌తి మారాలి

Leave A Reply

Your Email Id will not be published!