Kalyan Banerjee : నిన్నటి దాకా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ పై ఉన్నట్టుండి నలు వైపులా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరోపణలు రావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గోవా టీఎంసీ పార్టీ చీఫ్ పీకే వ్యవహారం సవ్యంగా లేదంటూ మండిపడ్డారు.
తాజాగా ఆ పార్టీకి చెందిన ఎంపీ కళ్యాణ్ బెనర్జీ(Kalyan Banerjee) ప్రశాంత్ కిషోర్ ను టార్గెట్ చేశారు. ఆయనపై నిప్పులు చెరిగారు. పీకే తనంతకు తాను గొప్పగా ఊహించుకుంటున్నారని కానీ అలా పాలిటిక్స్ లో జరగదన్నారు.
రాజకీయ పార్టీని రాజకీయ పార్టీ లాగే నడపాలని కానీ ఓ కాంట్రాక్టర్ నడపాలని అనుకోవడం మంచి పద్దతి కాదంటూ హితవు పలికారు. ఒక రకంగా పీకేపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవలే టీఎంసీకి ఐపాక్ కు మధ్య విభేదాలు పొడసూపాయంటూ విమర్శలు వస్తున్న తరుణంలో ఆ పార్టీ ఎంపీ బహిరంగంగా విరుచుకు పడడం చర్చకు దారి తీసింది.
తాను ఎంపీగా ఉన్న ప్రాంతంలో మున్సిపల్ కార్పొరేషన్ అడ్మినిస్ట్రేషన్ బోర్డుకు నియామకాలకు సంబంధించి తనను సంప్రదించ లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను సంప్రదించకుండా ఐపాక్ పలువురిని నియమించిందంటూ ఆరోపించారు.
తను ఎన్నికల వ్యూహకర్తగా ఉండాలని కానీ అన్నింట్లో వేలు పెడతానంటే ఊరుకుంటామా అని నిలదీశారు. పీకే టీఎంసీని పవర్ లోకి తీసుకు వచ్చేందుకు దోహదపడ్డాడు. ఇది కాదనలేని సత్యం.
దీదీని నేషనల్ వైడ్ గా ఫోకస్ చేస్తున్న తరుణంలో టీఎంసీ ఎంపీ ఆరోపణలు చేయడం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
Also Read : కాంగ్రెస్ లేకుండా కూటమి అసాధ్యం