Srisailam Brahmotsavam : మహిమాన్విత పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతున్న ఏపీ లోని శ్రీశైలం మల్లన్న స్వామి(Srisailam Brahmotsavam) ఆలయం ముస్తాబైంది. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవో పేతంగా ప్రారంభమయ్యాయి.
వచ్చే నెల మార్చి 4 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. దాదాపు 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది ఆలయ కమిటీ. లక్షలాది మంది శివభక్తులు నల్లమలలో కొలువుతీరిన మల్లన్న స్వామిని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు.
కాలి నడకన రహదారులన్నీ నిండి పోయాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. వేద పండితులు శాస్త్రోక్తంగా శ్రీకారం చుట్టారు ఉత్సవాలకు. సకల దేవతలను ఆహ్వానించారు.
రాత్రి శ్రీశైలం మల్లికార్జున స్వామి ధ్వజ స్తంభంపై ధ్వజా రోహణం, ధ్వజ పటావిష్కరణ కార్యక్రమం చేపట్టారు. శివ నామ స్మరణతో నల్లమల దద్దరిల్లింది.
ఇక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈనెల 23 నుంచి స్వామి , అమ్మ వార్లకు వాహన సేవలు, గ్రామోత్సవాలు నిర్వహిస్తారు. ఇప్పటికే భక్తుల సౌకర్యార్థం ఆన్ లైన్ లో దర్శనం టికెట్లను విడుదల చేశారు.
అతి శీఘ్ర ధర్శనం టికెట్లు రూ. 500 , శీఘ్ర దర్శనం రూ. 200 ఉచిత దర్శనం టికెట్లు కూడా అందుబాటులో ఉంచింది దేవస్థానం. ఇక 23న భృంగి వాహన సేవ, 24న హంస వాహన సేవ, 25న మయూర వాహన సేవ, 26న రావణ వాహన సేవ చేపడతారు.
27న పుష్ప పల్లకీ వాహన సేవ, 28న గజ వాహన సేవ చేస్తారు. మార్చి 1న ప్రభోత్సవం, లింగోద్శవ కాల రుద్రాభిషేకం, పాగాలంకరణ ఉంటుంది. 2న రథోత్సవం, 3న పూర్ణాహుతి, 4న అశ్వ వాహన సేవ నిర్వహిస్తారు.
Also Read : సీఎం కేసీఆర్ తో విభేదాలు లేవు