Ritika Rohit Sharma : భార్య‌ను మ‌రిచి పోతే ఎలా బాస్

రోహిత్ శ‌ర్మపై నెటిజ‌న్లు సెటైర్లు

Ritika Rohit Sharma : భార‌త క్రికెట్ జ‌ట్టు స్కిప్ప‌ర్ రోహిత్ శ‌ర్మ‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఇప్ప‌టికే విజ‌య‌వంత‌మైన నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్న ఈ హిట్ మ్యాన్ పై త‌ను ప్రాణ ప్ర‌దంగా ప్రేమించే భార్య రితికా ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్ చేసింది.

ఎంత కెప్టెన్ అయితే మాత్రం, ఎన్ని విజ‌యాలు సాధిస్తే మాత్రం నీకంటూ ఓ ఫ్యామిలీ లేదా అంటూ నిల‌దీసినంత ప‌ని చేసింది. క‌నీసం ఒక్క ఫోన్ కాల్ కూడా చేయ‌క పోతే ఎలా బాస్ అంటూ వాపోయింది.

దీంతో ఆమె చేసిన ట్వీట్ సోష‌ల్ మీడియాను షేక్ చేసింది. అయ్యో రోహిత్ శ‌ర్మ(Ritika Rohit Sharma) ఎంత ఆట‌గాడివైతే, ఎంత కెప్టెన్ వైతే ఇలాగేనా వ్య‌వ‌హ‌రించేది అంటూ నెటిజ‌న్లు, క్రికెట్ ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు.

ఆట‌తో పాటు ఫ్యామిలీ ఉంద‌న్న విష‌యం మ‌రిచి పోతే నీకే న‌ష్టం అంటూ సూచిస్తున్నారు. తాను ఫోన్ చేసినా ఎందుకు స్పందించ‌డం లేదంటూ రితికా గ‌ట్టిగానే రోహిత్ శ‌ర్మ‌ను అడిగేసింది.

ప్ర‌స్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండ‌గా విండీస్ తో టీ20, వ‌న్డే సీరీస్ గెలుపొందాక సంతోషం ప‌ట్ట‌లేక మ‌నోడు ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలు పోస్ట్ చేశాడు.

ఆపై క్యాప్ష‌న్ కూడా జ‌త చేశాడు. విజ‌యం సాధించాం. మున్ముందు కూడా ఇలాగే గెలుపొందాలంటూ పేర్కొన్నాడు. అయితే ఇదే స‌మ‌యంలో స‌క్సెస్ సాధించిన జోష్ లో అస‌లైన భార్య రితికాను మ‌రిచి పోయాడు.

త‌న‌కంటూ ఓ కుటుంబం ఉంద‌ని, అది లేక పోతే, ఆమె స‌పోర్ట్ లేక పోతే త‌ను లేడ‌న్న విష‌యం కూడా గుర్తు పెట్టుకోలేక పోయాడు.

దీంతో నెటిజ‌న్లు సెటైర్లు వేశారు. రితిక‌కు ఫుల్ స‌పోర్ట్ చేశారు. కొంచెం ప‌ట్టించుకో బాస్ అంటూ సూచించారు.

Also Read : నువ్వో అద్భుతం పోరాటం ప్ర‌శంస‌నీయం

Leave A Reply

Your Email Id will not be published!