INDW vs NZW : హమ్మయ్య కాస్తంత నయం. మన అమ్మాయిలు సత్తా చాటారు. న్యూజిలాండ్ టూర్ (INDW vs NZW )లో భాగంగా ఆఖరి ఐదో వన్డేలో విజయం సాధించి పరువు పోకుండా కాపాడారు.
ఇప్పటి వరకు ఆడిన నాలుగు వన్డే మ్యాచ్ లలో మహిళా జట్టు ఓడి పోయింది.
చివరి వన్డేలో సత్తా చటారు. ఓవల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో మన టీం 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
భారత జట్టు(INDW vs NZW )కీలక గెలుపులో స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్ ,
కెప్టెన్ , హైదరాబాదీ స్టార్ ప్లేయర్ మిథాలీ రాజ్ కీలక పాత్ర పోషించారు.
ఇక అంతకు ముందు టాస్ గెలిచింది కీవీస్ టీం కెప్టెన్. ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.
నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 9 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది.
ప్రత్యర్థి జట్టు బ్యాటర్లలో అమీలియా కేర్ ఏకంగా 66 పరుగులు చేసి సత్తా చాటింది. డివైన్ 34 పరుగులతో లారెన్ డౌన్ 30 రన్స్ చేసి రాణించారు.
టీమిండియా బౌలర్లలో గైక్వాడ్ , దీప్తి శర్మ, స్నేహా రాణా చెరో రెండు వికెట్లు తీశారు.
ఇక న్యూజిలాండ్ భారీ స్కోరు భారత మహిళల ముందు ఉంచింది. ఎక్కడా తొట్రు పాటు పడకుండా మన అమ్మాయిలు 46 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది.
భారత బ్యాటర్ లలో స్మృతి మంధాన 71 పరుగులతో సత్తా చాటింది. హర్మన్ ప్రీత్ కౌర్ 63 పరుగులతో దుమ్ము రేపింది. ఇక కెప్టెన్ మిథాలీ రాజ్ 57 పరుగులు చేసి విజయంలో కీలక భూమిక పోషించారు.
ఇక ఈ సీరీస్ లో ఆద్యంతమూ సత్తా చాటిన కీవీస్ ప్లేయర్ కేర్ కి విమెన్ ఆఫ్ ది సీరీస్ అవార్డు దక్కింది.
Also Read : ఆ ముగ్గురిపై రోహిత్ కీలక కామెంట్స్