Piyush Goyal : కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సంచలన కామెంట్స్ చేశారు. ఉత్తర ప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో 300 సీట్లు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఇప్పటి వరకు నాలుగు విడతలుగా పోలింగ్ జరిగింది. ఇంకా మూడు విడతల పోలింగ్ జరగాల్సి ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీ లోని ప్రయాగ్ రాజ్ లో జరిగిన సభలో గోయల్ (Piyush Goyal)పాల్గొని ప్రసంగించారు.
తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ పథకాలు అన్ని వర్గాల వారిని ఆదుకుంటున్నాయని ఈసారి కూడా తామే పవర్ లోకి వస్తామని చెప్పారు. తాము ప్రవేశ పెట్టిన వస్తు సేవల పన్ను – జీఎస్టీ విధానాన్ని వ్యాపారులు స్వీకరించారని తెలిపారు.
గతంలో పాలకులు తమ స్వలాభం కోసం చూసుకున్నారని కానీ తాము ప్రజా సంక్షేమమే పరమావధిగా పని చేస్తున్నామని చెప్పారు. 2017లో జరిగిన ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే అత్యధిక సీట్లు కైవసం చేసుకుంటామని అన్నారు పీయూష్ గోయల్(Piyush Goyal).
విజ్ఞానం, విద్య, సంస్కృతి, సాహిత్యం, ఆధ్యాత్మికం , కళలు , వాణిజ్య రంగాలలో ప్రయాగ్ రాజ్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందన్నారు.
2019లో జరిగిన కుంభ మేళాలో దేశంలో ఎక్కడా లేని విధంగా 5 కోట్ల మందికి పైగా ప్రజలు వచ్చారని తెలిపారు కేంద్ర మంత్రి. ప్రస్తుతం యోగి పాలనలో ప్రయాగ్ రాజ్ కొత్త పుంతలు తొక్కుతోందన్నారు.
అలహాబాద్ – దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కేబినెట్ మంత్రి నంద గోపాల్ గుప్తాతో సహా బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని గోయల్ కోరారు.
Also Read : మోదీజీ పుతిన్ తో మాట్లాడండి