Indian Students : రష్యా ఉక్రెయిన్ పై దాడులకు పాల్పడుతూనే ఉంది. బాంబుల మోత మోగిస్తోంది. ఇంకో వైపు మిస్సైల్స్ విసురుతోంది. దళాలు కదం తొక్కుతున్నాయి.
ఈ తరుణంలో ఉక్రెయిన్ రాజధాని కైవ్ లో ఎయిర్ పోర్ట్ ను మూసి వేశారు. దీంతో భారత దేశం నుంచి చదువుకునేందుకు ఉక్రెయిన్ కు వెళ్లిన 20 వేల మంది విద్యార్థులు (Indian Students )చిక్కుకు పోయారు.
ఇప్పటికే భారత్ నుంచి ఉక్రెయిన్ కు వెళ్లిన విమానాలు తిరిగి వచ్చాయి. పరిస్థితి మరింత భయానకంగా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది.
ఈ విద్యార్థులలో తెలుగు రాష్ట్రాలకు చెందిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అత్యధికంగా డాక్టర్, ఇంజనీరింగ్, తదితర కోర్సులు చదివేందుకు వెళ్లిన వారే ఉండడం విశేషం.
ప్రస్తుతం రష్యాతో స్నేహ సంబంధం కలిగి ఉన్న ఏకైక దేశాధినేత ఒక్క మోదీ మాత్రమే. ఇందులో భాగంగానే ఉక్రెయిన్ రాయబారి సైతం ప్రధానిని జోక్యం చేసుకోవాలని రష్యా చీఫ్ పుతిన్ తో మాట్లాడాలని కోరారు.
ఇప్పటికే ఉక్రెయిన్ లో 30 రోజుల పాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు ప్రెసిడెంట్. బంకర్ల వద్ద కొందరు తలదాచుకుంటున్నారు. మరికొందరు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు.
భద్రత కోసం సమీపంలోని మెట్రో స్టేషన్ లకు వెళుతున్నారని సమాచారం. వారిని ఎలాగైనా సురక్షితంగా భారత్ కు తీసుకు వచ్చేందుకు విదేశాంగ మంత్రిత్వ శాఖ (Indian Students )ప్రయత్నం చేస్తోంది.
ఉక్రెయిన్ గగనతలాన్ని మూసి వేయడంతో ప్రత్యేక విమానాల షెడ్యూల్ ను భారత్ రద్దు చేసింది.
Also Read : మోదీజీ పుతిన్ తో మాట్లాడండి